విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వివిధ స్థాయిలలో జగనన్న లేఅవుట్లలోని గృహ నిర్మాణాలను వేగవంతం చేసి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
నగరంలోని కలక్టరేట్ నుండి వారం వారిగా నిర్దేశించిన గృహ నిర్మాణాల ప్రగతిపై బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్థార్లు, గృహ నిర్మాణశాఖ వివిధ స్థాయి ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న లేఅవుట్లలో నిర్మాణాలు జరుపుకుంటున్న గృహాలను వారం వారిగా నిర్థేశించిన లక్ష్యాలను పూర్తి చేయాల్సిన భాధ్యత అధికారులపై ఉందన్నారు. గృహ నిర్మాణాల ప్రగతిపై రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు ప్రతి వారం లక్ష్యాలను సమీక్షిస్తున్నారన్నారు. నిర్మాణాలలో స్టేజ్ కన్వర్షన్ తప్పనిసరిగా జరగాలన్నారు. డిసెంబర్ మాసాంతానికి 30 వేల గృహ నిర్మాణాలను పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రారంభం కాని, బిలో బేస్మింట్, బేస్మింట్, రూఫ్, రూఫ్ కాస్టింగ్, స్థాయిలో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేందుకు వారం వారి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఈ వారం నిద్ధేశించిన 2,941 గృహ నిర్మాణాల పూర్తికి గాను 1,334 నిర్మాణాలను పూర్తి చేశారన్నారు. లక్ష్యాల సాధనలో వెనుకబడిన సంబంధిత మండల ప్రత్యేక అధికారులు తహాశీల్థార్ యంపిడివోలను కారణాలపై వివరణ కోరారు. కాన్ఫరెన్స్‌లో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, హౌసింగ్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వి శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవికాంత్ ఉన్నారు.
Prajavartha Online Telugu News