Breaking News

మహిళల సుస్థిర ఆర్థికభివృద్ధి జగనన్న లక్ష్యం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేదుకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం మాచవరం బి ఆర్. అంబేద్కర్ కమ్యూనిటీ హల్ మరియు రాణిగారితోట సిమెంట్ గోదాన్ నందు జరిగిన నియోజకవర్గంలోని 2,6 డివిజన్ల సంబందిచి 1273 మందికి సుమారు రూ 22,85,56,250/- 17,18,డివిజన్ సంబందిచి 990 మంది లబ్దిదారులకు సుమారు రూ 1,85,62,500/- వైయస్సార్ చేయూత లబ్ధిదారులకు నిధుల విడుదల కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని నమూనా చెక్కు విడుదల చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతి సంక్షేమ పధకం లో కూడా మహిళలకు పెద్ద పీట వేస్తూ నేరుగా వారి ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ వైయస్సార్ చేయూత పధకం ద్వారా వరుసగా మూడో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 45 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు గల దాదాపు 26.40 లక్షల మంది అక్కాచెల్లెమ్మ ల ఖాతాల్లో 4949 కోట్ల రూపాయలు జమ చేసారని తెలిపారు.ఎన్నికల మెనిఫెస్టో లో చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఏడాది కూడా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని అవినాష్ కొనియాడారు. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం రాబోయే జనవరి నుండి మరోసారి పెన్షన్ పెంచి 2750 రూపాయలు ఇస్తారని అన్నారు.రాష్ట్రంలో మహిళలు అంత ప్రభుత్వ పనితీరు పట్ల చాలా సంతోషంగా ఉన్నారని అందుకే గడపగడపకు వెళుతున్న మా వైస్సార్సీపీ నాయకులకు మంగళ హారతులతో బ్రహ్మరథం పడుతున్నారు అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, 2వ డివిజన్ కార్పొరేటర్ నిర్మలాకుమారి, 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్,17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, అడిషనల్ ప్రాజెక్ట్ శకుంతల, జోనల్ కమిషనర్ పార్థసారధి మరియు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *