Breaking News

నవరత్నాల పథకాలతో పేదరిక నిర్మూలన

-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-30 వ డివిజన్ 250 వ వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పేదరిక నిర్మూలనే ధ్యేయంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 30 వ డివిజన్ 250 వ వార్డు సచివాలయ పరిధిలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శనివారం ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మధ్యకట్టలో ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా పర్యటించి.. 385 గడపలను సందర్శించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రచ్చబండ కార్యక్రమంతో మూడు నెలలకోసారి అధికార యంత్రాంగాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లి జవాబుదారీతనం పెంచారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్సార్ కలలు కన్న స్థానిక సుపరిపాలనను సచివాలయ వ్యవస్థ రూపంలో సాకారం చేసి చూపారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారి నుండి సలహాలు, అర్జీలు స్వీకరించారు. ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే అడిగి తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్వయంగా తమ ఇంటికి వచ్చి చిరునవ్వుతో పలకరిస్తుండటంతో ప్రజల నుంచి విశిష్ట స్పందన లభించింది. తమ అభిమాన నాయకునితో సెల్ఫీ దిగేందుకు యువతులు పోటీ పట్టారు.

సచివాలయ పరిధిలో రూ. 3.52 కోట్ల సంక్షేమం
నవరత్నాల పథకాల ద్వారా రూ. 235 కోట్ల సంక్షేమాన్ని నియోజకవర్గంలోని 1,25,871 మంది లబ్ధిదారుల ఖాతాలలో మూడేళ్ల కాలంలో జమ చేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. 250వ వార్డు సచివాలయ పరిధిలో రూ. 3.52 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 259 మందికి క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 356 మందికి రూ. 46.28 లక్షలు., వైఎస్సార్ సున్నావడ్డీ ద్వారా 198 మందికి రూ.20.17 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 99 మందికి రూ. 29.23 లక్షలు., చేయూత ద్వారా 165 మందికి రూ. 30.93 లక్షలు., కాపు నేస్తం ద్వారా 14 మందికి రూ. 2.10 లక్షలు., వాహనమిత్ర ద్వారా 31 మందికి రూ. 3.10 లక్షలు., చేదోడు ద్వారా రూ. 10 వేల చొప్పున 21 మందికి రూ. 2.10 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

బీజేపీ గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకుంది
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రతిపక్షాలు గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకున్నాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. మరీముఖ్యంగా బీజేపీ నాయకులు ఎప్పుడేం మాట్లాడుతారో, ఎందుకు మాట్లాడుతారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక స్థితిగతులపై విమర్శలు చేసే ముందు.. కేంద్రానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో సోము వీర్రాజు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ బీజేపీ నేతలకు కుట్ర రాజకీయాలు తప్ప, రాష్ట్ర బాగోగులు ఏ మాత్రం పట్టవని మల్లాది విష్ణు విమర్శించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ పార్టీలు చేసిన ద్రోహాన్ని ఇక్కడి ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని మల్లాది విష్ణు అన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా ప్రజల నుంచి లభించిన ఘన స్వాగతానికి, చూపిన ఆదరాభిమానాలకు ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న ఇసుకపల్లి శివవర్మ అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తను మల్లాది విష్ణు పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి, డీఈ రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు గోపిశెట్టి శ్రీను, డి.దుర్గారావు, సాసుపల్లి రామకృష్ణ, మార్తి చంద్రమౌళి, సామంతకూరి దుర్గారావు, ముత్యాలు, ప్రసాద్, మనోహర్, సాంబ, ఈశ్వర్, దుర్గరాజు, ముద్రబోయిన దుర్గారావు, పవన్ రెడ్డి, పెద్దిరాజు, భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *