Breaking News

సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ కార్యాలయంలో ఆయుధాలకు పూజ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహర్నవమి సందర్భంగా సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ కార్యాలయంలో ఆయుధాలకు పూజ పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.యస్. నిర్వహించారు.  దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సాంప్రదాయ పద్ధతులను పురస్కరించుకుని ఆనవాయితీగా దసరా శరన్నవరాత్రులలో మహర్నవమి రోజున విజయవాడ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మరియు అన్ని విభాగాలలో ఆయుధాలకు పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహర్నవమి సందర్భంగా మంగళవారం విజయవాడ సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ కార్యాలయం నందు ఎన్.టి.ఆర్ జిల్లా నగర పోలీస్ కమీషన్ క్రాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో ఆయుధాలకు మరియు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సి.ఎస్.డబ్ల్యూ, డి.సి.పి.  ఉదయరాణి, ఇన్ ఛార్జ్ అడ్మిన్ డి.సి.పి. పి. వెంకట రత్నం, ఇన్ ఛార్జ్ పశ్చిమ డి.సి.పి. కొల్లి శ్రీనివాస్, హెడ్ క్వార్టర్ ఏ.సి.పి. చెంచి రెడ్డి, ఆర్.ఐ.లు, ఆర్.ఎస్.ఐ.లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *