విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాల్మీకి సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి ఏడవ రోజుకు చేరిన వాల్మీకుల సత్యాగ్రహ దీక్ష లు స్థానిక అలంకార్ సర్కిల్ లో ధర్నా చౌక్ నందు ఏడవ రోజు సత్యాగ్రహ దీక్షలు , నిరవదిక దీక్షలు చేస్తున్నారని కన్వీనర్ బి ఈశ్వరయ్య మాట్లాడుతూ శనివారం అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య సంఘీభావం తెలిపారని, అక్టోబర్ 9వ తేదీ వాల్మీకి జయంతి సందర్భంగా డప్పు వాయిద్యాలు సంబరాలు చేస్తామని అన్నారు, గతంలో వాల్మీకులను గిరిజనులు గానే పరిగణించి ఎస్టి జాబితాలోనే చూడబడే వారిని, అయితే ప్రాంతీయ వ్యత్యాసాలు సృష్టించి వాల్మీకి లేదా బోయలను అన్యాయానికి గురి చేశారని అన్నారు .2017 అప్పటి రాష్ట్ర ప్రభుత్వ వాల్మీకులకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తూ ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీని మరియు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్ నివేదికలను రాష్ట్ర మంత్రి మండలి లోతీర్మానించి రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానమును ఆమోదింపజేసి కేంద్రంలో ప్రభుత్వ చర్యలకు కేంద్ర ప్రభుత్వానికి పంపినారని తెలిపి ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఐదు సంవత్సరాల నుండి అవసరమైన చర్యలు చేపట్టకుండా తాత్శ్చర్యం చేయుచున్నారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాల్మీకిలను ఎస్టీ జాబితాలోనికి చేర్చాలని లేనియెడల అక్టోబర్ 25వ తేదీ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని అన్నారు. రాష్ట్ర రాజధాని అయిన విజయవాడలో గత ఏడు రోజులనుంచి నిరవధిక నిరాహార దీక్ష, సత్యాగ్రహ దీక్షలు చేయుచున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019లో కర్నూలు బహిరంగ సభలో వాల్మీకి లేదా బోయల చిరకాల వాంఛను అర్థం చేసుకున్నానని వారి న్యాయమైన కోర్కెను తీర్చేదినని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వాల్మీకి బోయల శాంతియుత నిరహార దీక్ష లోడిమాండ్ చేయుచున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ నాయకులు, కో. కన్వీనర్ హనుమంతరావు. కృష్ణాజిల్లా నాయకులు చొప్పరపు వరప్రసాద్, యం.వెంకటేశ్వరరావు, బి. నాగమణి, చి.హెచ్ భాను, జగదీష్, భాను ప్రకాష్, వాల్మీకి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News