Breaking News

మరింత మెరుగ్గా ప్రజల ముంగిట ప్రభుత్వ సేవలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ప్రాధాన్యత భవనాలు ఏర్పాటు చెయ్యడం ద్వారా మరింత మెరుగ్గా ప్రజల ముంగిట ప్రభుత్వ సేవలు అందించే క్రమంలో ఆయా భవనాల నిర్మాణ పనులపై ప్రత్యేక ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయ ఇంజనీరింగ్ సహయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 1,101 ప్రాధాన్యత భవనాలు నిర్మాణం చెయ్యనుండగా ఇప్పటి వరకు 681 భవనాలు పూర్తి చేసుకున్నామన్నారు. మిగిలిన సచివాలయ, అర్భికే, హెల్త్ క్లినిక్ భవనాలు పురోగతిలో ఉన్నాయన్నారు. పౌర సేవలు అందించే క్రమం లో ఆయా భవనాలు నిర్మాణం చేపడుతుండగా, కొన్ని మండలాల్లో మంచి పురోగతి సాధించారన్నారు. రాజానగరం, దేవరపల్లి, నల్లజెర్ల మండలాల్లో 100 శాతం సచివాలయ భవనాలు పూర్తి చెయ్యడం పట్ల అక్కడి సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. పెరవలి మండలం లో 55 ప్రాధాన్యత భవనాలకు 22, నిడదవోలు లో 64 భవనాలకు 27, ఉండ్రాజవరం లో 51 భవనాలకు 16 భవనాలు మాత్రమే ఇప్పటి వరకు పూర్తి చెయ్యడం పై కలెక్టర్ వివరణ కోరారు. మిగిలిన మండలాల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా సిబ్బంది, అధికారులు ఉన్నా కూడా ఎందుకు నిర్మాణాలు జరగటం లేదన్నారు. ఆయా మండలాల్లో పనులు జరగడం లో గానీ, చెల్లింపుల విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా పనులు జరుగు తున్నాయన్నారు. ప్రతి రోజు ఆయా భవనాలకు చెందిన పనులు పై పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేసుకుని, త్వరితగతిన పూర్తి చేసేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తో ఉండాలని మాధవీలత స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్ ఈ .. ఏబివి ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ డి. బాల శంకర్ రావు, ఐ సి డి ఎస్ జిల్లా సంక్షేమ అధికారి కె. విజయకుమారి, డి ఎల్ డి ఓ వి. శాంత మణి, ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయ ఇంజనీరింగ్ సహయకుల తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *