చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లు అందచేసేది సేవా అని, అదే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం చాగల్లు మండలం చంద్రవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 38 వ రోజు నియోజక వర్గంలో మంత్రి పాల్గొన్నారు. అందులో భాగంగా స్థానిక పంచాయతీ కార్యాలయంలో సచివాలయ, వాలంటీర్ లతో స్థానిక ప్రజా ప్రతినిదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత , మన ముఖ్యమంత్రి జగనన్న ఒక ఉన్నత మైన ఆశయంతో వాలంటీర్ వ్యవస్థ ను తీసుకుని రావడం జరిగిందన్నారు. అర్హులకు ప్రభుత్వం అందచేసే సంక్షేమ పథకాలను వారికి అందచేసెలా జవాబుదారీ తనం తో కూడి మీమీ భాద్యతలు నిర్వహించాలని కోరారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు వర్తింప చెయ్యడం కోసం అవసరమైన సహాయం అందచేయాలని , వారికి సలహాలు ఇవ్వడం ద్వారా మీ బాధ్యత నెరవేరింది అనుకోవద్దని స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారదిగానే కాకుండా మీ పరిధిలోని కుటుంబాలకు తగిన విధంగా అండగా నిలిచి, వారికి భరోసా ఇచ్చే అవకాశం మీకు ఉందని, అదే స్పృహ కలిగిన పనితీరు చూపాల్సి ఉంటుందన్నారు. మీరు ఇక్కడే మీ ఊరిలో ఉండే అవకాశం జగనన్న కల్పించటం జరిగిందని అన్నారు. వాలంటీర్ గా మీరు చేస్తుంది ఉద్యోగం లా కాకుండా సేవతో కూడి ఉన్నది అన్నది ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి యొక్క ఆలోచనతో కూడుకున్నదని మంత్రి తానేటి వనిత అన్నారు.
అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా కొవ్వూరు నియోజక వర్గం చాగల్లు మండలంలో 38 వ రోజు మంత్రి పర్యటించి, ప్రభుత్వం ద్వారా వారికి చేకూరిన ప్రయోజనాల్ని వివరించారు. చాగల్లు మండలంలోని 3577 మంది లబ్ధిదారులకు రు.6,71 కోట్లు మేర వైఎస్ఆర్ చేయూత ద్వారా జీవనోపాధి కై ఆర్థిక ప్రయోజనం కల్పించామన్నారు. కరోనా వల్ల ఆర్థిక భారం పెరిగినా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలను నిర్విరామంగా జగనన్న కొనసాగించారని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ వైస్ ఛైర్పర్సన్ పోసిన శ్రీలేఖ , ఎం పిపి ఎమ్. వీరాస్వామి, చంద్రవరం గ్రామ స ర్పంచ్ మద్దిపాటీ శ్రీనివాస్, స్థానికులు లకంసాని సూర్యప్రకాశరావు, సిహెచ్ దుర్గా మల్లే శ్వరరావు, రామమూర్తి , బండి అశోక్, గుమ్మడి శైలజనాథ్ నాగేశ్వరరావు కాoకటాల శ్రీనివాస్, జీ. శ్యామ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News