Breaking News

నూతన తూర్పు గోదావరి జిల్లా.. జిల్లా సమైఖ్య కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం

-అనంతరం జిల్లా సమైఖ్య తొలి సమావేశం
-కలిసి కట్టుగా జిల్లా సమైఖ్య ను అభివృద్ధి చేసుకోవాలి.. కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం సహాయక సంఘాల ప్రతినిధులుగా జిల్లా సమైక్య అధ్యక్షులు, కార్యదర్శులు ఎంతో కీలకమైన పాత్రను పోషించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.

మంగళవారం స్థానిక ఆర్సెట్టి కార్యాలయం లో జిల్లా సమైక్య తొలి సమావేశం నిర్వహించి, అధ్యక్ష, ఇతర సభ్యుల ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లా సమైక్య ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులు తమ లోని ఐక్యతను చాటుకున్నారన్నారు. మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేస్తున్నా అన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు తరువాత కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారి కోసం కొత్తగా ఆయా జిల్లాల్లో జిల్లా సమాఖ్య ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన చెయ్యడం జరిగిందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతినిధులుగా మీ పై ప్రత్యేక బాధ్యత ఉందన్నారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మహిళలకే పెద్ద పీట వేస్తున్నరని, ఈ విషయం మీకు విదితం అన్నారు. జిల్లాలోని మహిళలకు ప్రతినిధిగా మీపై ఎంతో గురుతర బాధ్యత ఉందన్నారు. ఎవరు అధ్యక్షులు, ఎవరు కార్యదర్శులు అనే విధానం లో కాకుండా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మరింత సమర్ధవంతంగా జిల్లా సమైఖ్య ద్వారా నిబద్దత తో, జవాబుదారి తనంతో కూడి సేవాభావంతో జిల్లాను ప్రగతి పథంలో ముందుకు నడిపేందుకు మీ వంతు కృషి చేయాలని కోరారు.

డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. డెగలయ్య మాట్లాడుతూ, జిల్లాలో 34,056 మంది స్వయం సహాయక సంఘాలకు చెందిన 3,40,000 మందికి ప్రతినిధులుగా నూతన తూర్పు గోదావరి జిల్లా కి చెందిన జిల్లా సమాఖ్య మీరు బాధ్యత తో కూడి పని తీరు చూపాలని అన్నారు. అనంతరం ఐదుగురి సభ్యులతో కూడిన పూర్తి స్థాయి జిల్లా సమాఖ్య కార్యవర్గ సభ్యులచే ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చిన్న జిల్లాలు అయినందున మరింత సమర్థవంతంగా మీ సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంటారని, ఆదిశలో పనిచేసి, జిల్లాకు మంచిపేరు తేవాలని సూచించారు. ఈ ఎన్నిక ప్రక్రియను జిల్లా సహకార అధికారి ఎమ్.బి.వి నాగభూషణం ఆధ్వర్యంలో నిర్వహించారు.

జిల్లా సమాఖ్య కార్యవర్గం:
అధ్యక్షురాలు కాలాబత్తుల సుజాత (నిడదవోలు), కార్యదర్శి తుర్రం సత్యవతి (గోకవరం), కోశాధికారి గోల్లు లక్ష్మి (రాజమండ్రి రూరల్), ఉపాధ్యక్షురాలు కురియాల కస్తూరి (సీతానగరం), జాయింట్ కార్యదర్శి చదలవాడ మరియమ్మ (చాగల్లు). ఈ కార్యక్రమంలో పిడి ఎస్. డేగలయ్య, డి సి వో ఎంబివి నాగభూషణం, డి పి ఎం (ఐబి) వై. జనార్ధన్ రావు, డి పి ఎం(ఫైనాన్స్) ఎమ్. సనత్ కుమార్, డిపిఎమ్ లు, ఏపీఎం లు, మండల సమైఖ్య అధ్యక్షులు, ఐ కే పి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *