రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా అటవీ అధికారి (టేరిటోరియల్) గా ఇతర శాఖలతో సమన్వయంగా పని చేయాలని నూతనంగా భాద్యతలు స్వీకరించిన డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బి. నాగరాజు తో జిల్లా కలెక్టర్ కే. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బి.నాగరాజు కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందచేసిన సందర్భంలో జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బి. నాగరాజు వివరాలు తెలుపుతూ, జిల్లాల పునర్విభజన లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా బదలీపై రావడం జరిగిందన్నారు. కడప జిల్లా కు చెందిన బి. నాగరాజు కడప జిల్లాకు చెందిన వారు కాగా జిల్లా అటవీ అధికారి ( సోషల్ ఫారెస్ట్) గా కడప జిల్లా నుంచి బదలీపై ఇక్కడ కు రావడం జరిగింది. గతంలో విశాఖపట్నం లో ఫ్లయింగ్ స్క్వాడ్ డి ఎఫ్ ఓ గా పని చేసియిన్నారు. నాగరాజు కు అభినందనలు తెలిపిన వారిలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News