విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఆయుర్వేద శాస్త్రంలో శస్త్ర చికిత్సలు, ఆధునిక పరిణామాలు, పారా సర్జికల్ ప్రోసిజర్ పై శాస్త్రీయ సెమినార్ నకు ముఖ్య అతిధిగా నగర సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్ధనరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొగల్రాజపురం లోని పి.బి. సిద్దార్ధ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం లో ఆదివారం ప్రారంభమైన శాస్త్రీయ సదస్సును ఉద్దేశించి శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ ఆయుర్వేద పురోగతికి తీసుకోవాల్సిన చర్యలు, నిర్ణయాల గురించి క్షుణ్ణంగా చర్చించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. ఈవిషయాలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు. తెలంగాణ హై కోర్టు జడ్జి పి. సుధ మాట్లాడుతూ ఆయుర్వేద విశిష్టత, వైద్య విధానాలపై సవివరంగా వివరించారు. ఆయుష్ కమీషనర్ రాములు మాట్లాడుతూ జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా ఆయుర్వేద అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆచార్య పి. బి. ఏ. వెంకటాచార్య జ్ఞాపకార్థం జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆయుర్వేద పి.జి. విద్యార్థుల ధీసిస్ పోటీలో విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈసందర్భంగా ప్రత్యేక సావనీర్ విడుదల చేసారు. తొలుత జ్యోతి ప్రజ్వలన గావించి సభను ప్రారంభించడం జరిగింది.
Prajavartha Online Telugu News