-ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పూసలు, బొమ్మలు అమ్ముకుంటు నక్కల వాళ్లగా పిలవబడుతున్న వారికి త్వరలో కులదృవీకరణ పత్రాలను మంజూరు చేస్తామని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నక్కల కుటుంబాల వారికి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
నగరంలో పూసలు అల్లుకుంటూ బొమ్మలు, ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకుని జీవనం సాగించే నక్కల కుటుంబాలతో గురువారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు వివిధ శాఖల అధికారులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవలన జరిగిన ప్రపంచ ఆదివాసి దినోత్సవంలో నక్కల కుటుంబాల వారు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు నేరుగా నక్కల కుటుంబ సభ్యులతో ముఖాముఖిని నిర్వహింస్తున్నామన్నారు. నక్కల కుటుంబాల వారు అత్యంత పేదవారైనప్పటికి సంప్రదాయాన్ని పాటించడంలో మహిళలకు గౌరవం ఇస్తారన్నారు. సహజంగా కుటుంబ వ్యవస్థలో తండ్రికి ప్రధాన స్థానం ఉంటుందని తండ్రి చెప్పిన విధంగా కుటుంబం మొత్తం నడుచుకుంటుందన్నారు. మహిళలను ముఖ్యంగా తల్లిని గౌరవించే నక్కల కుటుంబాల వారి సంస్కృతి తనకు ఎంతో నచ్చిందన్నారు. ఆడపిల్ల పుడితే ఆలోచించే రోజులలో ఆడపిల్లే పుట్టాలని కోరుకునే నక్కల వారి ఆలోచనను మిగిలిన వారు స్పూర్తిదాయకంగా తీసుకోవాలన్నారు.
తొలుత నక్కల కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు వారి జీవన విధానం గురించి వివరిస్తూ మా కుటుంబాల వారు పూర్వం నక్కలను వేటాడం వలన తమను నక్కల వారిగా పిలిచేవారని ప్రస్తుతం పూసలు అమ్మకుని జీవిచడంతో పూసలవాళ్లు అని పిలుస్తున్నారన్నారు. ప్రభుత్వం తమకు రేషన్ కార్డు ఆధార్‌కార్డు ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేసిన్నట్లు తెలిపారు.తమకు కులదృవీకరణ పత్రాలు లేవని ఎప్పటి నుండో అధికారులను అడుగుతున్నామని కుల దృవీకరణ పత్రం లేకపోవడం అతి పేదలమైన మేము ప్రభుత్వ నుండి ప్రయోజనాలను పొందలేకపోతున్నామని దృవీకరణ ప్రతాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ నగరంలోని రాజరాజేశ్వరి పేటలో 70 నుంచి 80 కుటుంబాల వారు నివాసం వుంటున్నారని మరో 10 నుండి 15 కుటుంబాల వారు మైలవరంలో నివాసం వుంటున్నారన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీరిలో 52 కుటుంబాలకు పక్క గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. వివాహాల అనంతరం కుటుంబాలు పెరగడంతో మరో 20 కుటుంబాలకు గృహాలు మంజూరు చేయవలసి ఉందని తెలిపారు. త్వరలో వీరికి జగనన్న కాలనీలలో పక్క గృహాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నక్కల కుటుంబాలు చేస్తున్న చిరువ్యాపారాలకు జగనన్న తోడు పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తామని జిల్లా కలెక్టర్ హామి ఇచ్చారు. మహిళలు డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా చేరి పొదుపు చేసుకుని బ్యాంకుల నుండి బుణ సహాయం పొంది ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ఇప్పటికే రెవెన్యూ అధికారికారులు నక్కల కుటుంబాల వారి సమాచారాన్ని సేకరించడం జరిగిందన్నారు. త్వరలో తమిళనాడులో వీరిని కురికారణ్ కులంగా పిలిచేవారని నక్కల కుటుంబాల వారందరూ కలసి వారి కులం పేరును సూచిస్తే అదే పేరున కుల దృవీకరణ పత్రాన్ని మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కుల దృవీకరణ పత్రాల మంజూరులో నక్కల వారు కాకుండా వారిపేరున ఇతరులెవరైన కుల దృవీకరణ పత్రం పొందేందుకు ప్రయత్నిస్తే అటువంటి వారి సమాచారాన్ని వెంటనే తమ దృష్టికి తీసకువస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు గోరుముద్ద, బాలామృతంల బాలింతలకు గర్భీణీలకు వైస్సార్ పౌషణ కిట్లు ద్వారా పౌష్టికాహరాన్ని అందిస్తున్నారన్నారు. ముఖ్యంగా విద్యాదీవెన, అమ్మఒడి, విద్యాకానుక, జగనన్న వసతి దీవెన వంటి పథకాలను అమలు చేస్తూ విద్యకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని నక్కల కుటుంబాల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి విద్యా బుద్దులు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు నక్కల కుటుంబాల తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా మెరుగైన వైద్యసహాయాన్ని అందిస్తున్నామని రేషన్ దుకాణల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. తమ కుల దృవీకరణ పత్రం మంజూరు ఇతర సమస్యల పరిష్కారంలో చొరవ చూపిన జిల్లా కలెక్టర్ డిల్లీరావును నక్కల కుటుంబ సభ్యులు పూసల దండలతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు.
సమావేశంలో సబ్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్వో కె. మోహన్‌కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రుక్మాందయ, డిఇవో సివి రేణుక, డిఎస్వో కోమలిపద్మ, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, హౌసింగ్ పిడి శ్రీదేవి, నక్కల కుటుంబాసభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News