Breaking News

సేఫ్‌ వేదికగా స్త్రీ పురుషులలో సమానత్వం సాధించేందుకు కృషి చేద్దాం..

-మహిళల రక్షణకు సేఫ్‌తో అడుగులు వేద్దాం..
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వాని సాధించేందుకు సేఫ్‌ (స్టెప్‌ ఏహెడ్‌ ఫర్‌ ఈ క్వాలటీ) కలిసి అడుగులు వేద్దామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
మహిళల రక్షణ హక్కులను కాపాడేందుకు ఏర్పడిన సేఫ్‌ సంస్థ ఆధ్వర్యంలో మెగలాజ్రపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్‌ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరై సేఫ్‌ (స్టెప్‌ ఏహెడ్‌ ఫర్‌ ఈ క్వాలటీ) వెబ్‌ సైట్‌ను లాంచనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పురాతన కాలంలో మహిళలకు ఎంతో గౌరవాన్ని ఇచ్చేవరన్నారు. అయితే కుటుంబ వ్యవస్థకు చెందిన వ్యవహరాలన్నింటిలో పురుషులదే అధిపత్యాంగా ఉంటుందన్నారు. ఇప్పటికి పురుషులు కంటే మహిళలను తక్కువ అన్న సూన్యత భావన కొనసాగుతూనే ఉందన్నారు. ఆధునిక పరిస్థితులలో కూడా ఇదే విధానం కొనసాగడం సరి కాదన్నారు. మహిళలు పురుషులు ఇద్దరూ సమానమనే భావాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు రాజ్యంగం అనేక హక్కులను కల్పించిందని వాటిని పై మహిళలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న మానసిక వేధింపులు, లైగింక దాడుల సంఘటనలకు సంబంధించి కొన్ని సంఘటనలలో మహిళల పాత్ర కూడా ఉండటం మనం చూస్తున్నామన్నారు. ముఖ్యంగా మహిళలలు తమకు తాము గౌరవించుకుంటే సమాజంలో మరింత గౌరవం లభిస్తుందన్నారు. ఎక్కడ మహిళ గౌరవించబడుతుందో అక్కడ గౌరవమైన సమాజం ఏర్పాడుతుందన్నారు. ఇటీవల నక్కల కుటుంబాల వారి సమస్యలను పరిష్కరించేందుకు వారి జీవన విధానం పై ఆర్జీనం చేయగా నక్కల కుటుంబాలలో తల్లిదే ప్రధాన పాత్ర అని ఆమె తీసుకున్న నిర్ణయనే కుటుంబం మొత్తం అమలు చేశారని తెలిసి ఆశ్చర్యానికి గురి అయ్యానన్నారు. ప్రస్తుతం పరిస్థితులలో స్త్రీ పురుషుల మధ్య బేదం తొలుగుతోందని ఇద్దరు అక్షరాశ్యతను సాధించి ఒకరిబావాన్ని మరోకరు పంచుకోవడమే దీనికి నిదర్శనమన్నారు. విద్యార్థి దశ నుండే స్త్రీ పురుషులలో సమానత్వం అనే భావనను తీసకువచ్చేందుకు సేఫ్‌ సంస్థ వేసిన అడుగులలో ముందుగా కళాశాలలో సేఫ్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. సేఫ్‌ సంస్థ ఏర్పాడి రెండు మాసాలు అయిన్నప్పటికి మంచి ఫలితాలను సాధిస్తున్నారన్నారు.స్త్రీ పురుషులలో సమానత్వం అనేది ముందు కుటుంబం నుండే ప్రారంభం కావాలన్నారు. ఆడపిల్లలు ఉన్నత విద్యాను అభ్యసించి జీవితంలో స్థిరపడేలా తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులు సహకరించిన్నప్పుడు ఆడపిల్లలో ధైర్యం తానంతట అదే వస్తుందన్నారు. మహిళల రక్షణ కొరకు ముందుకు వచ్చేవారితో అడుగులో అడుగు కలిసేలా జిల్లా యంత్రాంగ తరుపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. అసమానత కలిగించే విధంగా మాట్లాడినా మానసిక వేధింపులు లైంగిక దాడులకు పాల్పడితే కఠినమైన శిక్షణను ఎదుర్కోవలసి వస్తుందనే విషయాన్ని తెలియజేసి మానసిక ప్రవర్తన మార్చుకునేలా కృషి చేయాలని కలెక్టర్‌ అన్నారు. నానాటికి మహిళల అక్షరాశ్యతా శాతం పెరుగుతుందని తల్లిదండ్రులు ఆడపిల్లలలో ధైర్యన్ని నింపాలన్నారు. లైగింక దాడులు మానసిక వేధింపులను నివారించడం ద్వారా సురక్షితమైన జిల్లాగా సంస్థలు ముందుకు రావాలన్నారు. లక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాల విద్యార్థులు రూపొందించిన సేఫ్‌ సంస్థ వెబ్‌ సైట్‌ను రూపొందించిన లక్కిరెడ్డి బాలిరెడ్డి విద్యార్థులను జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అభినందించారు.
సేఫ్‌ సంస్థ అధ్యక్షురాలు జి. జోత్స్న మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం సాధించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాలలు, కళాశాలలు, నిరుపేదల నివాసిత ప్రాంతాలలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళా చట్టాలు హక్కుల గురించి వివరించి, మహిళ రక్షణకు కృషి చేస్తునట్లు వివరించారు. కళాశాలలో సేఫ్‌ టీమ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థిని విద్యార్థుల ప్రవర్తనపై నిఘా ఉంచి అసభ్య ప్రవర్తన చేస్తున్న వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు.
అవగాహన ఏపి సిఐడి ఎస్పీ సరిత, సిద్దార్థ మహిళ కళాశాల ప్రిన్సిపల్‌ టి విజయలక్ష్మి, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌ పద్మజ, ఎస్‌విడిఎస్‌ లా కళాశాల ప్రిన్సిపల్‌ సిహెచ్‌ దివాకర్‌బాబు, కెబిఎన్‌ కళాశాల ప్రిన్సిపల్‌ బి నారాయణ, నలంద కళాశాల ప్రిన్సిపల్‌ యం అనురాధ, సేఫ్‌ సంస్థ ఎక్యూటివ్‌ కమిటీ మెంబర్లు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్‌లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *