Breaking News

మల్లాది విష్ణు చేతుల మీదుగా జగనన్న క్రీడా సంబరాలు-2022 పోస్టర్ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో స్పోర్ట్స్ క్లబ్ లను ప్రోత్సహించే దిశగా క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఆధ్వర్యంలో మెగా టోర్నీని నిర్వహిస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు క్రీడా సంబరాలు-2022 పోస్టర్ ను శనివారం ఆయన ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నాలుగు క్రీడాంశాల్లో(కబడ్డీ, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్) రూ. 50 లక్షల నగదు బహుమతులతో పోటీలను నిర్వహిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. నియోజకవర్గ, జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి.. ఇలా నాలుగు దశలలో పోటీలు ఉంటాయని తెలిపారు. డిసెంబర్ 21న ఫైనల్స్ ను విజయవాడ నగరంలో అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోనూ అద్భుతాలు సృష్టించే క్రీడాకారులు ఎందరో ఉన్నారని.. వారిలో అత్యంత ప్రతిభ గల వారిని ఎంపిక చేసి టోర్నీకి పంపడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. కార్యక్రమంలో చీఫ్ కోచ్ అజీజ్, చీఫ్ ఎగ్జిగ్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఇతర కోచ్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *