Breaking News

బి.ఎం.సి.యు, ఏ.ఎం.సి.యు భవన నిర్మాణాలను నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేయాలి : కమిషనర్ & రిజిస్ట్రార్ కో – ఆపరేటివ్ సొసైటీస్ అహ్మద్ బాబు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని బిఎంసియు, ఎఎంసియు భవన నిర్మాణాలతో పాటు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల స్థల సేకరణ మరియు నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా చూడాలని కమిషనర్ & రిజిస్ట్రార్ కో – ఆపరేటివ్ సొసైటీస్ అహ్మద్ బాబు తెలిపారు. గురువారం అమరావతి నుండి కమిషనర్ & రిజిస్ట్రార్ కో – ఆపరేటివ్ సొసైటీస్ అహ్మద్ బాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లు, జిల్లా సహకార అధికారులు, మార్కెటింగ్ శాఖల అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి జే.సి. డి.కె.బాలాజీ, సంబందిత శాఖల అధికారులు హాజరయ్యారు.

రిజిష్ట్రార్ ఆఫ్ కో- ఆపరేటివ్ సొసైటీ డైరీ డెవలప్మెంట్ కమిషనర్ మాట్లాడుతూ.. జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా పాడి రైతులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉండి ఇంకా పూర్తి కాని మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లు, బి.ఎం.సి.యు లు, ఎ.ఎం.సి.యు లు, నిర్మాణాలను వేగవంతం చేయాలని తెలిపారు. భూ సేకరణ పూర్తి కాని చోట భూ సేకరణ పూర్తి చేసి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం జాయింట్ కలెక్టర్ డి.కే.బాలాజీ అధికారులతో సమావేశమై జిల్లాలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా పుత్తూరు, వడమాల పేట, నారాయణవనం మండలాలలో పాడి రైతులను గుర్తించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలోని రైతులకు సహకార సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయుటకు రైతు భరోసా కేంద్రాలను, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో అనుసంధానం చేయాలని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ లో భాగంగా మొదటి దశలో 30 గోడౌన్ల సంబంధించి గ్రౌండింగ్ పూర్త అయి నిర్మాణ దశలో ఉన్నవి పూర్తి చేయాలని తెలిపారు. రెండవ దశలో 29 గోడౌన్లకు సంబంధించి స్థల సేకరణ పూర్తి ఆయి నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మూడవ దశలో 104 గోడౌన్లకు గాను 71 గోడౌన్లకు స్థల సేకరణ గుర్తించడం జరిగిందని తెలిపారు. జగనన్న పాల వెల్లువకు సంబంధించి జిల్లాలో 218 బి ఎం సి యు నిర్మాణాలు, 623 ఏ.ఎం సి యు (ఆటోమేటిక్ మిల్క్ కూలింగ్ సెంటర్స్) కు గానూ పెండింగ్ లో ఉన్న 557 ఏఎంసియు ల స్థల సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశం లో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా కో ఆపరేటివ్ అధికారి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *