Breaking News

ఎస్‌డబ్ల్యుపిసి షెడ్ల నిర్మాణం పూర్తి చేసేలా తక్షణమే చర్యలు చేపడుతున్నాం…

-జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాకు మంజూరైన ఘన వ్యర్థ పధార్థాల నిర్వహణ కేంద్రాలకు (ఎస్‌డబ్ల్యుపిసి) భూముల గుర్తింపు ప్రక్రియను చేపట్టి నిర్మాణాలను పూర్తి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమీషనర్‌ కోన శశిధర్‌కు వివరించారు.
నగరంలోని కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి గురువారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లా కు మంజూరైన ఉపాధి హామిలో చేపడుతున్న 288 ఘన వ్యర్థ పధార్థాల నిర్వహణ కేంద్రాలకు (ఎస్‌డబ్ల్యుపిసి) గాను 257 నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన 31 నిర్మాణాలకు గాను 15 షెడ్లను నిర్మించేందుకు భూములను గుర్తించడం జరిగిందని షెడ్లను నిర్మించేందుకు అంచనాలను సిద్దం చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి ఆదేశించామన్నారు. మిగిలిన వాటికి సంబంధించి భూములను గుర్తించి త్వరలో నిర్మాణ పనులను చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాకు మంజూరైన 268 గ్రామ సచివాలయాలు, 260 రైతుభరోసా కేంద్రాలు, 239 హెల్త్‌ క్లినిక్‌ల భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బిలో బేస్‌మెంట్‌ స్థాయిలో ఉన్నవాటిని బేస్‌మెంట్‌ స్థాయికి, బేస్‌మెంట్‌ స్థాయిలో ఉన్న వాటిని రూప్‌లెవల్‌ స్థాయికి, రూప్‌లెవల్‌ స్థాయిలో ఉన్నవాటిని ఫినిషింగ్‌ స్థాయికి తీసుకువచ్చి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ డిల్లీరావు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమీషనర్‌ కోన శశిధర్‌ కి వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిపివో జె. సునీత, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ డి వెంకటరమణ, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ ఏ వెంకటేశ్వరరావు, ఏడి సర్వే సూర్యారావు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *