-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మూడవ విడతలో మంజూరైన ఎంపిఎఫ్‌సి (మల్లీ పర్సస్ ఫెసిలిటి సెంటర్స్) గోడౌన్‌లకు సంబంధించి భూ సేకరణ వేగవంతం చేస్తున్నామని రాష్ట్ర సహకార శాఖ కమీషనర్ బాబు ఏ కి జిల్లా కలెక్టర్ డిల్లీరావు వివరించారు. గురువారం సచివాయలం నుండి ఎంపిఎఫ్‌సి గోడౌన్‌లకు భూసేకరణ, నిర్మాణం, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్‌లకు భూసేకరణ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్‌లు, జాయింట్ కలెక్టర్‌లతో రాష్ట్ర సహకార శాఖ కమీషనర్ బాబు ఏ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి జిల్లా కలెక్టర్ డిల్లీరావు జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపిఎఫ్‌స ిగోడౌన్‌లకు సంబంధించి జిల్లాలో మూడవ విడత కింద 20 గోడౌన్‌లు మంజూరయ్యాయని వాటికి సంబంధించి భూ సేకరణ వేగవంతం చేస్తున్నామన్నారు. జిల్లాలో మొదటి విడతలో 49 గోడౌన్‌లకు నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని రెండవ విడతలో మంజూరైన 50 ఎంపిఎఫ్‌సి గోడౌన్ల నిర్మాణాలకు గాను 9 గోడౌన్‌లకు సంబంధించి భూ సేకరణ చేపట్టవలసి ఉందని మిగిలిన గోడౌన్‌లకు సంబంధించిన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్(బిఎంసియు) ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ ( ఏఎంసియు)లకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో భవన నిర్మాణాలు సకాలంలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డిల్లీరావు రాష్ట్ర సహకార శాఖ కమీషనర్ బాబు ఏ కి వివరించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో డిస్ట్రిక్ట్ కోఅపరేటివ్ ఆఫీసర్ సిహెచ్ శైలజ, మార్కెటింగ్ ఏడి కిషోర్‌లు ఉన్నారు.
Prajavartha Online Telugu News