Breaking News

రెడ్‌క్రాస్‌ సేవలలో భాగస్వామ్యలు కావాడం అభినందనీయం…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి వైపరీత్యాలు విపత్తులు అపద సమయాలలో ప్రజలకు సేవలందించడంలో ముందుటున్న ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటికి సహకారం అందిస్తున్న జిల్లా నీటి యజమాన్య సంస్థ, జిల్లా పంచాయతీ అధికారులు, ఉద్యోగులను అభినందిస్తున్నానని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటికి సహకారం అందించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు పిలుపు మేరకు డ్వామా, జిల్లా పంచాయతీ అధికారులు సిబ్బంది కలిసి 1 లక్ష 20 వేల రూపాలయలను శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ డిల్లీరావుకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ ప్రకృతి వైపరీత్యాలు విపత్తులు అపద సమయాలలో ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారన్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం తరుపున కొంత మేర ఆర్థిక సహాయాని అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉద్యోగులు వారికి తోచిన విధంగా రెడ్‌క్రాస్‌ సొసైటికి ఆర్ధిక సహాయం కోరడం జరిగిందన్నారు. మొట్టమెదటిగా జిల్లా నీటి యజమాన్య సంస్థ ఉద్యోగులు, సిబ్బంది 60 వేల రూపాయలు, జిల్లా పంచాయతీ అధికారులు ఉద్యోగులు 60 వేల రూపాయలు కలిపి 1 లక్ష 20 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని డ్వామా పిడి జె. సునీత ద్వారా అందజేసిన డ్వామా పంచాయతీ ఉద్యోగులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. ఆర్థిక సహాయం అందించిన వారిలో డ్వామా పిడి జె. సునీత వెంట అసిస్టెట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.పద్మ, ఏపివో వి. వెంకటేశ్వరరావు, సీనియర్‌ అసిస్టెట్‌ శ్రీథర్‌, జిల్లా విజలెస్‌ ఆఫీసర్‌ ఎస్‌ రామజనీయులు, నున్న రామవరపాడు ప్రసాదంపాడు పంచాయతీ కార్యదర్శులు రమణ, జి. రామోహన్‌, రాజంద్రప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *