Breaking News

అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పథకాల అమలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతికి తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు సంక్షేమ లబ్ది అందుతున్నాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ 25వ సచివాలయం పరిధిలోని గుణదల పడవల రేవు,శాంతినగర్,రెవెన్యూ కాలనీ ప్రాంతాల్లో వైస్సార్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందితున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు ,సంక్షేమ పథకాలు కోసం అవ్వతాత లు కూడా కార్యాలయాల చుట్టూ తిరిగే దినవస్థ ఉండేదని, లంచాలు ఇస్తే తప్ప ఏ పని అయ్యేది కాదని , దళారుల వ్యవస్థ ను ప్రోత్సాహించి ప్రజలను దోచుకొన్నారని విమర్శించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సచివాలయ,వలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి మధ్యలో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు.సంక్షేమం తో పాటు రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమ ల ఏర్పాటు మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్న ఘనత వైస్సార్సీపీ దే అని అన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు,ఆసుపత్రిలు కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది పేదలకు కూడా నాణ్యమైన విద్య,వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 95శాతం పైగా హామీలు కేవలం మూడేళ్ళ కాలంలో అమలు చేసారని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన ప్రజలకు వాస్తవాలు తెలుసని వారి సంపూర్ణ మద్దతు ప్రభుత్వానికి ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి, వైస్సార్సీపీ నాయకులు కోటి నాగులు, చందా కిరణ్,పెయ్యల అలంకార్ బాబు, జాస్తి ప్రసాద్, శ్రీమన్నారాయణ. సాయి, శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *