Breaking News

15వ డివిజన్ లో 37లక్షల రూపాయలతో సి.సి. రోడ్లు మరియు STP ప్లాంట్ కాంపౌండ్ వాల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం గా సాగుతున్నాయి అని, శంకుస్థాపన చేసిన ప్రతి పనిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం 15వ డివిజన్ ఈనాడు కాలనీ పట్టాభి రోడ్ లో సి.సి రోడ్లు మరియు రుద్రభూమి STP ప్లాంట్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కి దాదాపు 37లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ప్రతి పనిని పూర్తి చేస్తూ ప్రజలు ఏ నమ్మకం తో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు.గత తెలుగుదేశం ప్రభుత్వం లో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ డివిజన్ ను దత్తత తీసుకొంటున్నాను అని బూటకపు మాటలు చెప్పి ఎలాంటి అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. అందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థి బెల్లం దుర్గ గెలుపే అని అన్నారు. నాడు దేవినేని నెహ్రూ గారు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు వేసిన రోడ్లు ,డ్రైనేజ్ తప్ప గద్దె రామ్మోహన్ సొంతంగా చేసింది ఏమి లేదని ఎద్దేవా చేశారు. దుర్గ కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత డివిజన్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అందరికి సంక్షేమ పథకాలు అందించడమతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పటరని,మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని అన్నారు.అదేవిధంగా ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన ఘనత వైస్సార్సీపీ దే అని అన్నారు. ఆ రిటైనింగ్ వాల్ వలన ఇటీవల 4లక్షల క్యూసెక్కుల భారీ వరద వచ్చిన సరే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు అని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు.అదే గత తెలుగుదేశం ప్రభుత్వం లో నిర్మించిన నాసిరకం వాల్,తూములు వల్ల కొద్దిపాటి వరదకే ఈ ప్రాంతం అంతా జలమయం అయ్యి వారిని పునరావాస కేంద్రాలకు తరలించే పరిస్థితి ఉండేదని విమర్శించారు.ఈ ప్రాంతంలో నివసించేవారికి అనువుగా ఉండేలా 5కోట్ల రూపాయలతో నూతన మంచినీటి ట్యాంక్ నిర్మాణం గాని, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర ఏళ్ల కాలంలో 5 రోడ్లు, వాటర్ పైప్ లైన్ కొరకు దాదాపు 3కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు.జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నాతో పాటు,లక్షలాది మంది ప్రజలు సమర్దిస్తున్నారని అన్నారు.రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉంటారని ఉద్ఘటించారు. ఇక్కడి షో మాస్టర్,టీడీపీ నాయకులు వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టు కలలు కంటున్నారని అది ఎన్నటికీ జరగదు అని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు,వైస్సార్సీపీ నాయకులు కాము,కొల్లిపర శ్రీను, వెంకట్ రెడ్డి,శ్రీను,ఆకుల బాలాజీ,వెంకయ్యనాయుడు,కాళీ,పట్టాభి,గల్లా వెంకటేశ్వరరావు,డాక్టర్ ఎం ఎం రాజు,బోయిన పోతురాజు, ఈశ్వరరావు,రాజు,రామ లక్ష్మణ్,నారాయణరావు,కేశవ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *