Breaking News

చంద్రబాబు నాయుడు మీద దాడి పిరికిపంద చర్య… : చెన్నుపాటి ఉషారాణి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా, బాదుడే బాదుడు కార్యక్రమం నందిగామలో నిర్వహిస్తున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు పై జగన్ రెడ్డి రౌడీ మూకలతో రాళ్ల దాడి చేయడం పిరికిపంద చర్యని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి, అవినీతి అక్రమాలను, ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరిచిపోయినట్టు ఉన్నాడని తెలుగు మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి అన్నారు. శనివారం కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ జగన్ రెడ్డి చేస్తున్న అక్రమాలు, అవినీతిని తెలుగుదేశం పార్టీ బయటపెడుతుందని భయపడిన వైసిపి ప్రభుత్వం ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి, తట్టుకోలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, ఆటుపోట్లను తట్టుకున్న చంద్రబాబు నాయుడు  తెలుగుదేశం పార్టీ, ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని, తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వ, లోపాలను, అవినీతిని, ప్రజల వద్దకు తీసుకెళ్తామని, వైసీపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెబుతామని ఆమె హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎస్ కె.  కరీముల్లా మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా అని రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని ఆ భయంతోనే ఇలాంటి తుగ్లక్ చర్యలకు, జగన్ రెడ్డి పాల్పడుతున్నాడని, వైసీపీ ప్రభుత్వానికి, రోజులు దగ్గరపడ్డాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు పడమటి సతీష్ చంద్ర మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి కేవలం ఒక సంవత్సరం మాత్రమే సమయం ఉందని, తర్వాత వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం  ప్రభుత్వం అని ఈ వైసీపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు…

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *