Breaking News

ఇ-వేస్ట్‌ (ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు) భవిష్యత్‌ పై తీవ్ర దుష్పృభావం చూపిస్తాయి…

-ఇ-వ్యర్థాల నిర్వహణలో అవగాహన అవసరం
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇ-వేస్ట్‌ (ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు) భవిష్యత్‌ పై తీవ్ర దుష్పృభావం చూపనున్నాయని వ్యర్థాల నిర్వహణలో అవగాహన పెంచుకుని కాలుష్య నివారణలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. ఇ-వేస్ట్‌ నిర్వహణపై శ్రీ దుర్గామల్లేశ్వర సిద్దార్థ మహిళ కళాశాల, జిల్లా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సంయుక్తంగా మహిళ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు ముఖ్య అదితిగా హాజరయ్యారు. సదస్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్‌ వ్యర్థ పదార్థాలు భవిష్యత్‌ పై తీవ్ర దుష్పృభావం చూపనున్నాయన్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగం నానాటికి పెరిగిపోతుందన్నారు. వినియోగించిన ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాడైనప్పుడు వాటిని బహిరంగంగా చెత్తకుండీలు, డ్రైనేజిలలో వేయడం వలన తీవ్ర కాలుష్యం ఏర్పాడుతుందన్నారు. ఇ`వేస్ట్‌తో పాటు సాలిడ్‌ వేస్ట్‌, డ్రై వేస్ట్‌, వేస్ట్‌ వాటర్‌ను డ్రైనేజిలలో వేయడం వలన అవి సమీపంలోని కాలువల ద్వారా నదులు, సముద్రంలో కలుస్తాయన్నారు. తద్వారా నదులు సముద్రంలో జీవించే జలచరాలు కాలుష్యానికి గురి అవుతున్నాయని వాటిని ఆహారంగా తీసుకునే ప్రజలకు కాలుష్యకోరలకు చిక్కుతున్నారన్నారు. జల, వాయుకాలుష్యంతో పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలలో ఉండే లెడ్‌, కార్డియం, మెర్క్యురీ వంటి రసాయన పదార్థాల వలన కలిగే అనర్థ్థాలను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్ట్రానిక్‌ వ్యర్థ పద్దార్థాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన ఉండాలన్నారు. గృహాల నుండి సేకరించే తడి, పొడి చెత్తతో పాటు ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను పారిశుద్ద్య కార్మికులకు విడివిడిగా సేకరించే భాధ్యతను స్థానిక సంస్థలు చేపట్టాలన్నారు. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలైన కంప్యూటర్స్‌, సెల్‌ఫోన్లు, సిడిలు, బ్యాటరీలు, ఎల్‌ఇడి బల్బులు వంటి వస్తువులు పర్యావరణానికి హాని కలిగిస్తాయని కలెక్టర్‌ అన్నారు. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వాటిని ప్రత్యేకంగా సేకరించేందుకు కలక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేట్‌ రంగంలో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను విక్రయించే సంస్థలు ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను రీబాక్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో వ్యర్థ పదార్థాల నిర్వహణను తప్పనిసరిగా అమలు పరచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఇ-వేస్ట్‌ నిర్వహణలో విజయవాడ నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రభుత్వ పరంగా చేపట్టే చర్యలకు స్వచ్చంద సంస్థలు, విద్యార్థులు సహకారం ఎంతో అవసరమన్నారు. కళాశాలలు, పాఠశాలల యాజమాన్యలు వ్యర్థపదార్థాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా అవగాహన సదస్సులను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక సేవ కార్యాక్రమాలతో పాటు సామాజికాభివృద్ధిలో విద్యార్థులను భాగస్వామ్యులు చేయడంలో అగ్రస్థానంలో ఉన్న సిద్ధార్థ మహిళ కళాశాల నిర్వహుకులను, అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చేతన్యవంతులుగా చేసేందుకు కృషి చేస్తున్న ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ డా. జి సమరంలను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. సదస్సులో రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షులు డా. జి. సమరం, సిద్దార్థ మహిళ కళాశాల డైరెక్టర్‌ టి. విజయలక్ష్మి, ప్రిన్సిపల్‌ ఎస్‌ కల్పన, విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *