Breaking News

ఎ కొండూరు తండాల్లో మాస్‌ స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహిస్తాం…

-కిడ్నీ వ్యాధిగ్రస్తుల కొరకు మండల కేంద్రంలో ప్రత్యేక డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు
-6 కోట్ల రూపాయలతో తక్షణమే రక్షిత త్రాగునీరు సరఫరా
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎ కొండూరు ప్రాంతంలోని గిరిజన తండాల్లో కిడ్నీ వ్యాధిని నివారించేందుకు మాస్‌ స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించి వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కిడ్నీ వ్యాధిగ్రస్తుల సౌకర్యార్ధం మండల కేంద్రంలో ప్రత్యేక డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
ఎ కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యం. టి. కృష్ణబాబు కిడ్నీ నివారణకు చేపట్టవలసిన చర్యలపై మంగళవారం సాయంత్రం సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేయడం జరిగిందన్నారు. ఎ కొండూరు ప్రాంతంలో 15 తండాలకు చెందిన ప్రజలు కిడ్నీ వ్యాధితో భాధపడుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. తండాల్లో మాస్‌ స్క్రీనింగ్‌ టెస్టులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సీరమ్‌ క్రియాటిన్‌ టెస్టులు నిర్వహించి వ్యాధి గ్రస్తులను గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. గుర్తించిన వ్యాధి గ్రాస్తులకు ఉచితంగా మందులను సరఫరా చేయాలని ఇందుకు మూడు నెలలకు సరిపడ మందులను రాష్ట్ర మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ నుండి సేకరించి సిద్దంగా
ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యాధి బారిన పడిన వారికి డయాలసిస్‌ నిర్వహించేందుకు ఎ కొండూరు మండల కేంద్రంలో ప్రత్యేక డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు. సెమీ టెంపరరి స్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసి త్వరలో డయాలసిస్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని డియంహెచ్‌వోకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. తండాల నుండి మండల కేంద్రంలోని డయాలసిస్‌ సెంటర్‌కు రోగులను తరలించేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎ కొండూరు ప్రజలకు 6 కోట్ల రూపాయల డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ నిధులతో తండాలకు మైలవరం పంపింగ్‌ స్రీన్‌ కృష్ణానది నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 38 కోట్ల రూపాయలతో రక్షిత త్రాగునీటిని సరఫరా చేసేలా ప్రభుత్వం పథకానికి అనుమతి మంజూరు చేయడం జరిగిందని పథకం పూర్తి అయ్యేలోపు తాత్కాలిక ప్రాతిపదికన 6 కోట్ల రూపాయల వ్యయంతో వెంటనే రక్షిత మంచినీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *