Breaking News

రాష్ట్రపతి ద్వారా ఝాన్సీరాణి నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు పొందటం జిల్లాకు గర్వకారణం…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య ఆరోగ్య శాఖలో విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యుత్తమ సేవాలు అందించినందుకుగాను మిరియాల ఝాన్సీరాణి భారత రాష్ట్రపతి చేతుల మీదగా నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు పొందటం జిల్లాకే గర్వకారణమని ఆమె అందించిన సేవలు స్పూర్తిదాయకంగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
వైద్య రంగంలో ఉత్తమ సేవలందించినందుకు నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డుకు ఎంపికై ఢల్లీిలో భారత రాష్ట్రపతి నుండి అవార్డును స్వీకరించి బుధవారం నగరానికి చేరుకున్న మిరియాల ఝాన్సీరాణిని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆయన కార్యాలయంలో దుశ్శాలువాతో సత్కారించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అత్యుత్తమ సేవలందిచిన నర్సులను ఎంపిక చేసి నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డులను ప్రకటించడం జరుగుతుందన్నారు. 2021 సంవత్సరానికి సంబంధించి అవార్డుకు ఉమ్మడి రాష్ట్రల నుండి విజయవాడ పాత ఆసుప్రతులో సేవలందిస్తున్న మిరియాల ఝాన్సీరాణిని ఎంపిక చేయడం ఎన్‌టిఆర్‌ జిల్లాకు గర్వకారణం అన్నారు. కోవిడ్‌ సమయంలో ఝాన్సీరాణి భర్త కోవిడ్‌ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పడు కూడా ధైర్యంగా ఆసుపత్రి రోగులకు సేవలందించి మన్ననులను పొందారన్నారు. ప్రభుత్వ సర్సుగా ఆమె అందించిన సేవలకుగాను 2016లో పోలీస్‌ కమీషనర్‌ నుండి గోల్డెన్‌ సిటిజన్‌ అవార్డుతో పాటు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కలెక్టర్లు పలు స్వచ్చంద సంస్థల నుండి ఉత్తమ సేవా అవార్డులను పొందారన్నారు. ఆమె సేవలను గుర్తించి అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డును స్వీకరించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుప్రతిలో సూపరింటెండెంట్‌ డా. సౌభాగ్యలక్ష్మి, ఎపిఎన్‌జివో నాయకులు ఎ విద్యాసాగర్‌, జె స్వామి, కె. సంపత్‌ కుమార్‌, బివి రమణ, సివిఆర్‌ ప్రసాద్‌, నర్శింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కె. శివలీల, షమిబేగం, జాన్సన్‌రాణి తదితరులు పాల్గొంటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *