Breaking News

ప్రజల సంపూర్ణ మద్దతుతో వైస్సార్సీపీదే మరలా అధికారం:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వారి సంపూర్ణ మద్దతుతో రాబోయే ఎన్నికల్లో మరింత భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ 35వ సచివాలయ పరిధిలోని మహబూబ్ అలీ స్ట్రీట్,బేగ్ వీధి,డేరంగుల వెంకట స్వామి వీధి,భగత్ సింగ్ రోడ్డు ప్రాంతాల్లో ప్రాంతాల్లో వైస్సార్సీపీ నాయకులు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ విప్లవం మొదలుపెట్టారని అధికారంలోకి వచ్చిన కేవలం మూడేళ్ళ కాలంలోనే 95 శాతం పైగా హామీలు అమలు చేయడంతో పాటు,ఎన్నికల మెనిఫెస్టో లో లేని ఎన్నో పధకాలు ఆచరణలో పెట్టారని కొనియాడారు. గడపగడపకు వస్తున్న వైస్సార్సీపీ నాయకులకు బ్రమహారథం పడుతున్న ప్రజల స్పందన చూస్తుంటేనే ప్రభుత్వం పట్ల వారు ఎంత సంతృప్తి గా ఉన్నారో అర్థం అవుతోంది అని అన్నారు. ప్రజలలో రోజురోజుకు జగన్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అన్ని ఏకమై వారి మనుగడ కోసం ప్రాకులాడుతున్నాయని, కానీ అవన్నీ వృధా ప్రయాస తప్ప ఫలితం ఉండదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రజా ధనం దుర్వినియోగం చేసి, టీడీపీ నాయకులు సొంత ఆస్తులు పెంచుకోవడానికే పాటుపడ్డారని, లంచాలు,దందాలతో మహిళలను హించించారని విమర్శించారు. అందుకే గత ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పి వైస్సార్సీపీ కి ఘన విజయం అందించారని అన్నారు. ఓడిన సరే తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని సహకారం అందిస్తూ వందల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారని, ప్రజా సమస్యలను తీర్చడానికి అండగా నిలుస్తున్నారు అని చెప్పారు. నియోజకవర్గంలో అధికంగా ఉన్న కొండ ప్రాంత అభివృద్ధి కి ప్రత్యేక ప్రణాళికలు వేసి నూతన మెట్లు మార్గాలు, అవ్వతాతలకు వీలుగా రైలింగ్ ఏర్పాటు, ఇంటింటికి మంచినీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పన చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలాకుమారి,వైస్సార్సీపీ నాయకులు చందా కిరణ్,చిన్నబాబు,మొయిన్,వెంకన్న,కనపర్తిబాబు,కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేత
తూర్పు నియోజకవర్గంలోని 2వ డివిజన్ కు చెందిన షేక్ మెహబూబ్ కి వైద్య ఖర్చులు నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 15,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ చైర్మన్, నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అందజేశారు. బుదవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మసీద్ స్ట్రీట్ లో పర్యటించినప్పుడు రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి గురుంచి అవినాష్ కు వివరించగా తక్షణమే స్పందించిన ఆయన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *