Breaking News

విద్యారంగానికి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ అందించిన సేవలు స్పూర్తిదాయకం..

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంస్కరణల కర్త బహుముఖ ప్రజ్ఞాశీలి తత్వవేత్త భారతరత్న మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ విద్యారంగ అభివృద్ధికి అందించిన సేవలు అజరామరమని నేటి తరం ఆయనను స్పూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పింగళి వెంకయ్య సమావేశపు మందిరంలో జనాబ్‌ భారతరత్న మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ 135వ జయంతి వేడుకను పురస్కరించుకొని మైనార్టీ సంక్షేమ దినోత్సవం జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఎస్‌డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరై జ్వోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ సంస్కరణలకర్త బహుముఖ ప్రజ్ఞాశీలి తత్వవేత్త భారతరత్న మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ విద్యారంగ అభివృద్ధికి అందించిన సేవలు అజరామరమన్నారు. నేటి తరం ఆయనను స్పూర్తిగా తీసుకోవాలన్నారు. బహుభాషాకోవిదుడు, గొప్ప రాజకీయవేత్త, విద్యావేత్త స్వాతంత్ర సమరయోధుడు జనాబ్‌ అబుల్‌ కలామ్‌ సమాజాన్ని ప్రభావితం చేసి మహోన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. మౌలానా అంటే పండితుడు అని అర్థం మన్నారు. అరబిక్‌ పెర్షియన్‌ ఉర్దూ, ఇంగ్లీష్‌, హిందీ, బెంగాలీ బాషలలో ఆయన నిష్ణాతను సాధించారన్నారు. ఆయన పేరు సార్థకం అయ్యేలా విభిన్న భాషలలో నిష్ణాతను సంపాధించి విద్యావిధానంలో గొప్ప సంస్కరణను తీసుకువచ్చారన్నారు. భారత తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగానికి ఎనలేని కృషి చేశారన్నారు. మహిళలు విద్యావంతులై అన్ని రంగాలలో రాణించాలనే ఆయన ప్రయత్నానికి ఫలితంగా నేడు మహిళాలు రాజకీయ ఆర్థిక విద్యా సామాజికి రంగాలలో పురుషులతో సమానంగా రాణించగలుగుతున్నారన్నారు. జాతీయ విద్యా విధానము (నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ 2020)లో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ గుర్తు చేశారు. అబ్దుల్‌ కలాం పరిశోధనలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారన్నారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో భారత దేశంలోనే తొలి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ఖర్గపూర్‌లో స్థాపించడం జరిగిందన్నారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఏషియన్‌ స్టడీస్‌ కలకత్తాలోను సిఎస్‌ఐఆర్‌ రీసెర్చ్‌ ఇనిస్ట్యూట్‌, సాహిత్య అకాడమీ సంగీత అకాడమీలను స్థాపించారన్నారు. యునివర్సిటి కమీషన్‌ అఖిల భారత విద్య కౌన్సిల్‌ ఫర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ కమీషన్‌, సెకండరీ ఎడ్యుకేషన్‌ కమీషన్‌, ఆల్‌ ఇండియా టెక్నికల్‌ కౌన్సిల్‌, సెంట్రల్‌ సోషల్‌ డెవలప్మెంట్‌ బోర్డు, సెంట్రల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు, కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ వంటి అనేక సంస్థలు కమీషన్లు కౌన్సిల్స్‌ మౌలానా ఆజాద్‌ ఆధ్వర్యంలో స్థాపించబడ్డాయన్నారు. విద్యారంగానికి ఆయన అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1992లో భారతరత్న అవార్డుతో సత్కరించగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయన జయంతిని మైనార్టీ సంక్షేమ దినంగా ప్రకటించిందన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విద్యార్థులకు జగనన్న విద్య, వసతి దీవెన పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఫ్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌, మెరిట్‌ కం మీన్స్‌ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. విదేశీ విద్యపథకం కింద విదేశాలలో చదువుకునే విద్యార్థులకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు స్కాలర్‌షిప్‌ కింద మంజూరు చేస్తున్నామన్నారు. ముస్లిమ్‌లకు వివాహ శుభకార్యల కోసం షాదీకాన నిర్మాణాలు, మసీదులు, చర్చిలు, శ్మశానవాటికల నిర్మాణాలు మరమత్తులకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. చర్చిలో సేవలందిస్తున్న పాస్టర్లకు గౌరవ వేతనం కింద ఒక్కోక్కరికి 5 వేల రూపాయలను పారితోషకం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
తొలుత దర్గా ఇ ఇస్లామీ ఉర్దూ పాఠశాల బిషప్‌ అజరయ్య పాఠశాలల విద్యార్థులు అందించిన సందేశాలు, అలపించిన గేయాలు సభికులను అలరించాయి. బిషప్‌ రెవ. కరుణానిధి, ముస్లిమ్‌ మత పెద్దలను ముక్తి హబీబ్‌ మహమ్మద్‌్‌, మౌలానా అబుల్‌ రజాక్‌లను జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌ శివరామకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జమలపూర్ణమ్మ, ముస్లిమ్‌ మతపెద్దలు ముక్తి హబీబ్‌ మహమ్మద్‌్‌ మౌలానా అబ్దుల్‌ రజాక్‌, క్రిస్టియన్‌ మత పెద్దలు రెవ. కరుణానిధి, మైనార్టీ సంక్షేమ అధికారులు ఎస్‌వి నాంచారయ్య , కె. సతీష్‌, షరీఫ్‌, ఎస్‌. శ్యామలదేవి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *