-జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత
-“చికిత్స కన్నా నివారణ మిన్న”
-డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి సీనియర్ న్యాయమూర్తి కె. ప్రత్యూష కుమారి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై ఎయిడ్స్ రహిత సమాజాన్ని స్థాపించాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సాన్ని పురస్కరించుకొని గురువారం ఎయిడ్స్ నివారణ పై స్థానిక వై జంక్షన్ తుమ్మలోవ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టరు డా. మాధవీలత, జిల్లా న్యాయసేవాదికార సంస్థ కార్యదర్శి కే. ప్రత్యూష కుమారి, వైద్యాధికారులతో కలసి జెండా ఊపి ర్యాలిని ప్రారంభించారు. అనంతరం స్థానిక డా. అంబేద్కర్ కమ్యూనిటి హాల్ నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టరు డా. కె. మాధవీలత మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలన్నారు. నేడు ఆధునాతన చికిత్స అందుబాటులో ఉన్నాయని, వైద్యుల సూచన సలహాల మేరకు మందులు, ఆహారం తీసుకోవడం వలన దీర్ఘకాల జీవితాన్ని పొందవచ్చని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యమై ఎయిడ్స్ రహిత సమాజాన్ని స్థాపించాలని పిలుపునిచ్చారు.
విజ్ఞాన సదస్సు లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు ప్రత్యూష మాట్లాడుతూ హెచ్ ఐ వి, ఎయిడ్స్ నియంత్రణ పై అందరికీ అవగాహన పై కల్పించాలన్నారు. “చికిత్స కన్నా నివారణ మిన్న” కాబట్టి అందరూ నివారణ మార్గాలను తెలుసుకోవాలన్నారు. ఈ విషయం లో మౌనం వీడి అవగాహన పెంచుకోవాలన్నారు. వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపడం చట్ట రీత్యా నేరమని పేర్కొన్నారు. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ బాధితులకు వైద్య సదుపాయాల గురించి వివరించారు. హెచ్ ఐ వి వ్యాధి బారినపడిన వారికి వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. ఇది గాలి, నీటి ద్వారా సోకే వైరస్ కాదని హెచ్ఐవి వైరస్ సోకిన వారి పిల్లలను దూరంగా ఉంచకుండా వారితో చక్కగా ఆడుకోవచ్చునని ఆమె అన్నారు. ఎయిడ్స్ బాధితులకు స్వయం ఉపాధి కోసం రుణాలు కూడా మంజూరు చేస్తారని ఆమె తెలిపారు. న్యాయ పరమైన ఏ సమస్యలు ఎదురైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాల్సిందిగా ప్రత్యూష కుమారి కోరారు.
డి.ఎం.హెచ్.ఓ డా.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో సమగ్ర సలహా మరియు ఐసిటిసి కేంద్రాలు, సమీకృత ఐసిటిసిలు, సుఖ వ్యాధుల చికిత్సా కేంద్రాలు తదితర సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఈ వైరస్ ఒకరూ లేదా ఎక్కు మంది, సెక్స్ వర్సర్సు తో లైగింక సంపర్కం వలన మాత్రమే వస్తుందన్నారు. జిల్లాలో కళాజాత బృందాల ద్వారా ఎయిడ్స్ పై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన వివరించారు.
జిల్లా లెప్పర్సీ, ఎయిడ్స్, మరియు టీబీ కంట్రోల్ అధికారి డా. ఎన్. వసుందర మాట్లాడుతూ లైంగిక పరమైన అంశాల వలన ఎయిడ్స్ సోకుతుందని, సమాజంలో ఎవరి పట్ల వివక్షత చూపవద్దనన్నారు. బాహ్య ప్రపంచంలో జరుగుతున్న ఆకృత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. 2021 లెక్కలు ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 3.84 కోట్లు మంది ఈ వైరస్ సోకినట్లు నిర్థారించారని తెలిపారు.
ఈ సందర్బంగా చేంజెస్ స్వచ్చంద సంస్థ వారు 15 మంది చిన్నారులలకు, వాలెంటరీ సర్వీసెస్ స్వచ్చంద సంస్థ వారు 30 పెద్ద వారికి హెచ్ ఐ వి, టీబీ పెషెంట్లకు బలవర్థకమైన ప్రోత్సకాహార కిట్లను అందజేసారు.
ఈ సందర్భంగా హెచ్. ఐ.వి, ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్.ఐ.వి, ఎయిడ్స్ నివారణకు కృషి చేస్తున్న వైద్యులు, సిబ్బందికి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు సర్టిఫికేట్, జ్ఞాపికలను అందజేశారు. ఎయిడ్స్ నివారణ ప్రతిజ్ఞను చేశారు.
ఈ కార్యక్రమంలో డీ.ఎం.హెచ్.వో డా కె. వేంకటేశ్వర రావు, తూర్పు గోదావరి జిల్లా ఎయిడ్స్, కుష్ఠి, క్షయ వ్యాధుల నియంత్రణ అధికారి డా.ఎన్.వసుంధర, డిప్యూటీ డిఎంహెచ్ఓ డా.బి.లూసి కార్డిలియా, యంహెచ్ఓ విన్నూత్న, డా. కోమలి, సీ.డీ.పీ.వో శ్రీమతి. సీహెచ్.వి.నరసమ్మ, త్రి టౌన్ సీ.ఐ. జి.మధు బాబు, తదితరులు ప్రసంగించారు. మెడికల్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, విద్యార్థినిలు, ఎన్ జీ వో లు, ఐ సి డి ఎస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News