Breaking News

ప్రజలందరూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్గి ఉండాలి

-ఎయిడ్స్ నియంత్రణ పద్ధతులు పాటించాలి
-రాష్ట్ర హోం శాఖ మాత్యు లు డా. తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలందరూ ఎయిడ్స్ వ్యాధి పట్లఅవగాహన కల్గి ఉండాలని, ఎయిడ్స్ వ్యాధి సోకకుండా త గు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర హోం శాఖ మాత్యులు డా. తానేటి వనిత అన్నారు. గురువారం ఉదయం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న మారుమూల ప్రాంత వాసులకు సైతం ఎయిడ్స్ పై అవగాహన కల్పించాలన్నదే ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 వ తేదీన నిర్వహించు కోవడం జరుగు తోందన్నారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన క ల్పించడం, ఎయిడ్స్ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం, హెచ్ఐవీ కి వ్యతిరేకంగా పోరాడడం వంటి కార్యక్రమాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు , స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి వనిత తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు పెరగకుండా, రాబోయే భావితరాలకు ఈ వ్యాధులు శోకకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధి నిర్ములన చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీ విజయ విహార్ మీదుగా బస్ స్టేండ్ వరకు సాగింది.

ఈ కార్యక్రమం లో కొవ్వూరు రెవిన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్న కుమారి, కొవ్వూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వల్లభ శెట్టి గంగాధర శ్రీనివాస్, మాజీ ఎం.ఎల్.సి కోడూరి శివరామ కృష్ణ, వైస్ చైర్ పర్సన్ లు మన్నె పద్మ, గండ్రోతు అంజలీ దేవి, రుత్తల భాస్క రరావు, ఏలూరి విజయలక్ష్మి, బండి పట్టాభి రామారావు, వార్డు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు, స్కూల్ విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *