విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 10వ డివిజన్ ఫన్ టైం రోడ్ వెనుక భాగంలో ఆదివారంనాడు ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో నిరాశ్రయులైన కుటుంబాలకు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆదేశానుసారం స్థానిక వైస్సార్సీపి నాయకులు పర్వతనేని బాబీ,కారుటూరి హరీష్ మరియు ట్రస్ట్ సిబ్బంది సొంగా రాజ్ కమల్ పరామర్శించి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వంట సామగ్రి, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా తగు సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
Prajavartha Online Telugu News