Breaking News

నాణ్యమైన‌ విద్యుత్ నిరంతరాయంగా అందించ‌డ‌మే ల‌క్ష్యం

-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-విద్యుత్ డీఈ కార్యాలయ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే చేతులమీదుగా శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా విద్యుత్‌ రంగంలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారని ఏపీ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. అజిత్ సింగ్ నగర్లో రూ. 32 లక్షల వ్యయంతో చేపట్టిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (APCPDCL) డీ-4 కార్యాలయ భవన నిర్మాణానికి నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి సోమవారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారంలో విద్యుత్ శాఖ ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. ఒక్క గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనే పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, వందల సంఖ్యలో విద్యుత్ దీపాలు అమర్చినట్లు వెల్లడించారు. నూతనంగా నిర్మించనున్న కార్యాలయం ద్వారా 1,11,266 మంది విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. నగరంలో ప్రస్తుతం 5 సబ్ స్టేషన్ల నిర్మాణాలు జరుగుతుండగా.. అందులో నాలుగు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో శ్రీనగర్ కాలనీ, ఉడాకాలనీ సబ్ స్టేషన్ల నిర్మాణాలు తుది దశకు చేరుకోగా.. త్వరలోనే ప్రారంభిస్తామని తెలియజేశారు. జీవీఆర్ కాలనీ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలోని సబ్ స్టేషన్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయవలసిందిగా అధికారులను సూచించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ ప్రాంతం ఒక కొత్త రూపు సంతరించుకుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. ఆ మహానేత హయాంలోనే తాను ఎమ్మెల్యేగా ఉండగా వాంబే కాలనీ, అయోధ్య నగర్లలో కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మించుకున్నట్లు గుర్తుచేశారు. ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల సమస్యలను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోతలు లేని నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సబ్ స్టేషన్ల వారీగా పది రోజులకోసారి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా ఆలోచన చేయాలని అధికారులకు సూచించారు.

నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ శాఖకు సంబంధించిన కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.వి.సుధాకర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో మల్లాది విష్ణు గారు చూపే శ్రద్ధ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన అన్న ఒక్కమాటతో డి-4 సబ్ డివిజన్ ఏర్పాటు అయినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే చొరవతో విద్యుత్ శాఖకు సంబంధించి నియోజకవర్గంలో ప్రస్తుతం రూ. 20 కోట్ల పనులు జరుగుతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఏడీ టి.రవిచంద్ర, ఏఈలు డి.కిరణ్ కుమార్, సతీష్, నాగేశ్వరరావు, రామలింగేశ్వరరావు, జె.ఎ.ఓ సుధాకర్, ఏడీ(సివిల్) థారా సింగ్, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా, నాయకులు అవుతు శ్రీనివాస్ రెడ్డి, అఫ్రోజ్, హఫీజుల్లా, నేరెళ్ల శివ, బత్తుల దుర్గారావు, విద్యుత్ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *