Breaking News

జిల్లాలో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనకు అధికారులు కృషి చేయాలి…

-కలెక్టరు డా. కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 11542 మంది గర్భిణీ స్త్రీలకు రక్త పరీక్షలు నిర్వహించి, రక్తహీనత (anemia) ఉన్నట్లు గుర్తించిన 3800 మందికి పౌష్టికాహారాన్ని అందించే దిశలో ఐసిడిఎస్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

గురువారం వెలగపూడి నుంచి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి యం.టి. కృష్ణబాబు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలు జరుగుతున్న పలు అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరు డా. మాధవీలత తో పాటు వీడియో కాన్ఫరెన్స్ లో వైద్య ఆరోగ్య శాఖాధికారులు హాజరయ్యారు.

జిల్లాలో 12216 మంది గర్భిణీ స్త్రీలు ఉండగా వారిలో 11542 మంది (94.48%) రక్తహీనత పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు. వాటిలో సుమారు 3800 మందికి రక్తహీనత ఉన్నట్లు గుర్తించి వారికి పౌష్టికాహారాన్ని అందించే దిశలో ఐ సి డి ఎస్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 10-19 సంత్సరాల కౌమారదశ లో ఉన్న వారు 144737 మంది ఉండగా వారిలో 90930 మంది (63%) పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో 5 సంవత్సరాల లోపు తక్కువ బరువు ఉన్న పిల్లలు 4039 మంది ఉండగా వారిలో 3218 మందికి పౌష్టికాహరం అందించామన్నారు. 5 సం.లోపు బలహీనత కలిగిన 7054 మంది లో 5664 మందికి జగనన్న సంపూర్ణ పోషణ అందించామన్నారు.

జిల్లాలో బడిబయట పిల్లలు 5633 మందిలో తిరిగి 4120 మందిని తిరిగి స్కూల్స్ కి పంపుతున్నట్లు తెలిపారు. స్కూల్స్ లో టాయిలెట్స్, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టరు అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు నిర్దేశించిన గడువులోగా జిల్లాలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అధికారులు ప్రత్యేక కృషి చేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *