Breaking News

వైద్యాధికారుల పని తీరు మారాలి, వైద్య సేవల్లో పురోగతి కనిపించాలి…

-మండల స్థాయి సమీక్ష ఎం.పి.డి.ఓ ల అద్యక్షతన జరగాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా వైద్యాధికారులు ప్రజలకందించే వైద్య సేవల్లో అలసత్వం ప్రదర్శించకుండా పురోగతి కనిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం వైద్య అధికారులతో జిల్లా కల్లెక్టర్ అద్యక్షతన సమన్వయ సమావేశం జిల్లా కలెక్టరేట్ లో జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ పై గౌ.ముఖ్యమంత్రి సలహాదారు సమీర్ శర్మ , ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తున్నారని, వైద్య శాఖ కు సంబంధించి వివిధ రకాల యాప్ లు అందుబాటులో ఉన్నాయని సంబందిత అధికారులు అవగాహన తో ప్రభుత్వ కార్యక్రమాల అమలు పటిష్టంగా జరగాలని అన్నారు. జిల్లాలో గర్భిణీ స్త్రీల వైద్య పరీక్షలు 83 శాతం మాత్రమే జరిగిందని, పెండింగ్ లో ఉన్న 17 శాతం వారి రక్త హీనత ఉన్నది లేనిది ఎలా? తెలుస్తుందని, ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్నదనే విషయం తెలుసుకొని రానున్న సోమవారం లోపు 100 శాతం వైద్య పరీక్షలు పూర్తి కావాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న సంపూర్ణ పోషణ కిట్లు సక్రమంగా అందించేలా ఐ.సి.డి.ఎస్ చర్యలు చేపట్టాలని సూచించారు. 10-19 వయసు గల ఆడపిల్లలు వైద్య పరీక్షలు కూడా 56 శాతం మాత్రమే జరిగిందని ఇది వారి భవిష్యత్ ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అని దాదాపు వీరు పాటశాలల్లో , కళాశాలలో చదువుతున్న వారుగా ఉంటారని స్కూల్ హెల్త్ ప్రోగ్రాం పటిష్టంగా నిర్వహించి పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడ గాని పరీక్షల నిర్వహణలో తప్పు జరగరాదని రక్త హీనత ఉన్న విషయాన్ని తెలిపి, ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ పోషణ కిట్లు వాడే విధంగా చూసి వారిని రక్త హీనత నుండి బయట పడేలా చూడాల్సి ఉంటుందని అన్నారు. గర్భీణీ స్త్రీలకు అందించే ఐరన్ ఫోలిక్ యాసిడ్ మందులు సరఫరా ఉన్న ఐ.సి.డి.ఎస్, వైద్య శాఖ సమన్వయ లోపంతో 70 శాతం మాత్రమే పంపిణీ చేసి యున్నారని పూర్తి స్థాయి పంపిణీ జరగాలని సూచించారు. 5 సంవత్సరాల లోపు పిల్లలు బరువు తక్కువగా ఉన్న వారు గత సంవత్సరం బేస్ లైన్ సర్వే లో 5101 పిల్లలు ఉంటె నేడు 6337 గా ఉన్నారని, 5089 పిల్లలకి సంపూర్ణ పోషణ అందించినట్టు లేదని ఆన్లైన్ రిపోర్ట్ ప్రకారం తెలుస్తున్నదని, ఖచ్చితంగా పిల్లలకు సంపూర్ణ పోషణ అందించి ఉంటే ఇంత మంది బరువు తక్కువ పిల్లలు ఉండేవారు కాదని అన్నారు. అలాగే వీరిలో 405 మంది పిల్లలను న్యుట్రీషణ్ రిహాబిలేషణ్ సెంటర్ లో వైద్య సేవలు అందించినట్టు చూపిస్తున్నారని చిన్న పిల్లల ఆసుపత్రిలో అంత మంది వైద్య సేవలు పొందారా లేదా? పరిశీలించాలని అన్నారు. ఎత్తు తక్కువ పిల్లలు 12600 మంది ఉన్నారని, ప్రతి డిసెంబర్ మాసంలో గ్రోత్ మానిటర్ జరుగుతుందని ఖచ్చితమైన సేవలందించి మీరు పని చేస్తున్న వృత్తికి న్యాయం చేయాలని సూచించారు. 10-19 వయసు పిల్లలలో రక్త హీనత తగ్గించడానికి గోరు ముద్ద ఖచ్చితంగా పాటశాలల్లో అందించేలా చూడాలని అన్నారు . హాస్టల్స్ ఐ.టి.ఐ, పాలిటెక్నిక్, రెసిడేన్సీయల్ స్కూల్స్ జాబితాలను ఎస్.సి, బి.సి, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్లు పర్యవేక్షించి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. ఫ్యామిలి డాక్టర్ కాన్సెప్ట్ విధానంలో ప్రతి రోజు మీరు వెళ్ళే గ్రామ జనాభాను దృష్టిలో ఉంచుకొని ఒకే చోట ఉండకుండా మరో రెండు గ్రామాలలో పర్యటించేలా వీలును బట్టి చూడాలని తప్పనిసరి ఆరోగ్య శ్రీ, ఎన్.ఆర్.సి వైద్య సేవలు పొందిన, బెడ్ రిడన్ వారి కుటుంబాలకు వెళ్లి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. బడి మానేసిన పిల్లల విషయంలో ఇంటింటి సర్వే నిర్వహించాలని గుర్తించిన వారిని బడిలో చేర్పించాల్సి ఉంటుందని, ఎం.ఈ.ఓ లు దృష్టి పెట్టాలని సూచించారు. ఇక పై ప్రతి నెల మండల అభివృద్ధి అధికారి సమన్వయ సమావేశం నిర్వహించాలని, సచివాలయాల్లో వారి పరిధిలోని గర్భిణీ లు, స్కూల్ పిల్లలు, బడి మానేసిన పిల్లలు, ఆరోగ్య శ్రీ చికిత్స పొందిన వారి జాబితా అందుబాటులో ఉండేలా రిజిస్టర్ల నిర్వహణ చేపట్టాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు సి.పి.ఓ అశోక్ కుమార్ , డి.ఎల్.డి.ఓ సుశీల దేవి, డి.ఎం.హెచ్.ఓ శ్రీహరి, ఎస్.సి వెల్ఫే ఆఫీసర్ చెన్నయ్య, బి.సి.వెల్ఫేర్ ఆఫీసర్ యుగంధర్, అడిషనల్ డి.ఎం.హెచ్.ఓ అరుణ సులోచనా దేవి, డిప్యూటి డి.ఎం.హెచ్.ఓ లు శ్రీనివాసులు, కిశోర్, హనుమంతరావు, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *