-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ఉద్యోగులు విధి నిర్వహణలో ఒత్తిడికి గురి కావడం సర్వ సాదారణమని అయితే తరచూ వైద్య పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
కలెక్టరేట్ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా హాజరైన వివిధ శాఖల జిల్లా అధికారులకు, అర్జీదారులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డిల్లీరావు, అధికారులతో కలిసి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ మదుమేహం (షుగర్), రక్తపోటు( బిపి) పరీక్షలను ప్రతీ అధికారి క్రమంతప్పక నిర్థేశించిన సమయాలలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం వుంటుందన్నారు. సమయానికి ఆహారం తీసుకోవడం, ఆహార పదార్థాలలో పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం ఉండేలా చూసుకోవాలన్నారు. అధికారులు ప్రతి రోజు ఉదయం నడక, యోగా, ప్రాణాయామం వంటి వ్యాయామం చేయడం వలన ప్రశాంతత సంతరించుకుంటుందని, ప్రతీ అధికారి తాము నిర్వహించే విధులతో పాటు తప్పకుండా కొంత సమయాన్ని వీటి కోసం కేటాయించాలన్నారు. వయసురిత్యా వచ్చే ఆనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు జిల్లా కలెక్టర్ డిల్లీరావు సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. యం సుహాసిని, వైద్యులు, డా. పవన్‌వర్మ, సునీల్‌వర్మ ఆధ్వర్యంలోని వైద్య బృందం నిర్వహించిన ఈ వైద్య పరీక్షలలో 150 మందికి పైగా అధికారులు అర్జీదారులకు షుగర్, బిపి హిమోగ్లోబిన్ నిర్థారణ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు ఉన్నారు.
Prajavartha Online Telugu News