Breaking News

సెమి క్రిస్మస్‌ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెమి క్రిస్మస్‌ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మైనార్టి కార్పొరేషన్‌ యండి జె. ఎలీషాతో సెమి క్రిస్మస్‌ వేడుక ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 20వ తేది మంగళవారం సాయంత్రం నగరంలోని ఏప్లస్‌ కన్వెక్షన్‌ హాల్‌లో నిర్వహించే సెమి క్రిస్మస్‌ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దంగా వుంచాలన్నారు. క్రిస్మస్‌ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రీష్టియన్‌ సోదరి సోదరిమణులతో క్యాడిల్స్‌ వెలిగించడం, క్రిస్మస్‌ కేక్‌ కటింగ్‌, తేనేటీ విందులో పాల్గొని క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుతారన్నారు. ప్రధాన వేదికను ఆకర్షనీయంగా అలంకరించాలన్నారు. ముఖ్యమంత్రితో పాటు సెమి క్రిస్మస్‌ కార్యక్రమంలో పాల్గొనే క్రీష్టియన్‌ మత పెద్దలు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ప్రభుత్వ సలహదారులకు ప్రోటోకాల్‌ ప్రకారం ప్రత్యేక ఆశనాలు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ అధికారులకు ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *