Breaking News

నవభారత నిర్మాత, తెలుగు జాతి కీర్తిపతాక పీవీ నరసింహారావు

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ ఆర్థిక వ్యవస్థను తన సంస్కరణలతో గాడిన పెట్టిన మహామేధావి పీవీ నరసింహారావు అని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మాజీ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు వర్ధంతి సందర్భంగా సత్యనారాయణపురంలో ఆ మహనీయుని విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ సమగ్రాభివృద్ధికి పీవీ నరసింహరావు అందించిన సేవలను స్మరించుకున్నారు. దేశంలో బలమైన ఆర్థిక వ్యవస్థకు పీవీ పునాదులు వేశారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కొనియాడారు. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం ఆయన సొంతమ‌ని కీర్తించారు. పీవీ నరసింహారావు తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు దేశాభివృద్ధికి బాటలు పరిచాయన్నారు. అంతర్గత భద్రత వ్యవహారాలు, విదేశాంగ వ్యవహారాల్లోనూ పీవీ అవలంభించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పటిష్ఠపరిచిందన్నారు. ఆర్థిక, విద్య, భూపరిపాలన తదితర రంగాలలో పీవీ నరసింహారావు ప్రవేశపెట్టి, అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని నేడు దేశ ప్రజలు అనుభవిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అటువంటి మహనీయుని సేవలను భావితరాలు స్మరించుకునే విధంగా సత్యనారాయణపురంలో పీవీ కాంస్య విగ్రహ ఏర్పాటుకు సంకల్పించినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతులు మీదుగా విగ్రహాన్ని ప్రారంభించే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం పేదలకు పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి శ్రీను, నాయకులు శనగవరపు శ్రీను, మైలవరపు రాము, ఉప్పు రంగబాబు, కమ్మిలి రత్న, కూనపులి ఫణి, కోలవెన్ను కొండ, చల్లా సుధాకర్, నాళం సురేష్, నాళం బంగారి, ఎస్.భగవాన్ రాజు, రవిశంకర్, పార్టీ శ్రేణులు, పీవీ అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *