Breaking News

రాయనపాడు వ్యాగన్ వర్క్ షాప్ లో వార్షిక తనిఖీ నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్

– పనితీరుపై అధికారులతో సమీక్ష సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు అనగా తేదీ 23 డిసెంబర్ 2022 న రాయనపాడులోని వ్యాగన్ వర్క్‌షాప్ లో వార్షిక తనిఖీని చేపట్టారు . ఈ తనిఖీలో జనరల్ మేనేజర్ తో పాటు దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ జె .కె జైన్, ఎస్.శ్రీనివాస్, చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్, రాయనపాడు మరియు ఇతర సీనియర్ అధికారులు కుడా ఉన్నారు. జనరల్ మేనేజర్ వ్యాగన్ వర్క్‌షాప్‌లో మొదటగా తనిఖీ చేపట్టారు. ఉద్యోగ విధి నిర్వహణలో హిందీ భాష యొక్క వినియోగాన్ని, బాష పై అవగాహన కల్పించే లక్ష్యంతో హిందీ లైబ్రరీని జనరల్ మేనేజర్ గారు ప్రారంభించారు . తదనంతరం ఎం & జి స్టోర్స్, స్ట్రిప్పింగ్ షాప్, బి సి ఎం హెచ్ ఎల్ డోర్స్ రిపేర్స్ సెక్షన్, కాంపోనెంట్ షాప్ మరియు జీరో బే – ఆర్ హెచ్ వ్యాగన్ లను తనిఖీ చేసారు . దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ బే-1 వద్ద 20 టన్నుల ఈ ఓ టి క్రేన్‌ను ప్రారంభించారు. అనంతరం బే-1 నుంచి 5, సీబీసీ విభాగం, బోగీల దుకాణం, వీల్ షాపులను తనిఖీ చేశారు. పరిపాలన భవనంలో ట్రేడ్ యూనియన్లతో ఆయన సంభాషించారు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా పచ్చని వాతావరణం కోసం మొక్కలు నాటారు. అనంతరం జనరల్ మేనేజర్ అధికారులతో పనితీరుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, వ్యాగన్ వర్క్‌షాప్ యొక్క తదుపరి అభివృద్ధి ప్రణాళికల గురించి చర్చించి అధికారులకు పలు సలహాలు ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *