Breaking News

త్వరలో బిఆర్ఎస్ పార్టీలోకి ఆర్ కె యాదవ్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో గొర్రెల కాపరులకు అత్యంత విలువ ఇచ్చి అభివృద్ధి చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే అని షీప్ అండ్ గోట్ బ్రీడర్స్ ఫెడరేషన్ ఉమ్మడి కృష్ణాజిల్లా మాజీ చైర్మన్ గోరిపర్తి రామకృష్ణ యాదవ్ అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్కే యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలకు, ఆయన నాయకత్వ లక్షణాలకు ఆకర్షతుడైననని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు వంటి పథకాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో విద్యుత్ మీటర్లను ముందుగా వ్యతిరేకించింది కెసిఆర్ అని గుర్తు చేశారు. జనవరి నెలాఖరులోపు భారీ ర్యాలీతో హైదరాబాద్ వెళ్లి కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరనట్లు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కొనిజేటి ఆదినారాయణ మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ నుండి కేసీఆర్ ని కలవడానికి హైదరాబాద్ కు పెద్ద ఎత్తున వెళుతున్నట్లు తెలియజేశారు. 26 వ తేదీ హైదరాబాద్ రావాలి అనుకున్నవారు అలానే బిఆర్ఎస్ పార్టీలో చేరాలి అనుకునేవారు 9491, 015222 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *