Breaking News

బడుగు బలహీనర్గాల వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి జగన్ : మంత్రి మేరుగ నాగార్జున

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాంగంలో కల్పించిన వాటా కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అవినీతికి తావు లేకుండా అందజేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహమునందు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన పేదలందరికీ ఎలాంటి రెకమండేషన్ లేకుండా, కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా పారదర్శకంగా ఎస్సి ఎస్టీ బిసి మైనార్టీల వర్గాలకు రాజ్యాంగం లో కల్పించిన వాటాకంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు పరిచి అవినీతికి ఎక్కడ తావు లేకుండా పారదర్శకంగా ఆమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, నవరత్నాల పథకాలలో భాగంగా అర్హులైన వారి అందరికి అమ్మ ఒడి,జగనన్న విద్యా దీవెన,జగనన్న వసతి దీవెన, వైయస్సార్ చేయూత వైయస్సార్ ఆసరా వైఎస్సార్ పింఛన్లు తో పాటుగా అర్హులైన వారందరికీ గృహాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా మన బడి నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయడం తో పాటుగా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున, ఇండ్లు లేని పేద అందరికి ఇండ్లు మంజూరు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో 31 లక్షల ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని,మొదటి విడతకు సంబంధించి ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయాని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన కమీషన్ సభ్యులు వడిత్య శంకర నాయక్, సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారి చెన్నయ్య,తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *