Breaking News

అమ‌రావ‌తి బోన్సాయ్ గార్డెన్ ప్రారంభం…


విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
న‌గ‌రంలోని పండిట్ నెహ్రూ బ‌స్‌స్టేష‌న్ స‌మీపంలో ఉన్న రాజీవ్‌గాంధీ మున్సిప‌ల్ పార్క్‌లో అమ‌రావ‌తి బోన్సాయ్ గార్డెన్‌ను బుధ‌వారం ప్రారంభించిన‌ట్లు అమ‌రావ‌తి బోన్సాయ్ సొసైటి అధ్య‌క్షురాలు అమృత కుమార్ తెలిపారు. 2018లో ప్రారంభ‌మైన అమ‌రావ‌తి బోన్సాయ్ సొసైటి మొక్క‌ల పెంప‌కంపై అనేక అవ‌గాహ‌న స‌ద‌స్సులు, శిక్ష‌ణా త‌ర‌గ‌తులు ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి బోన్సాయ్ మొక్క‌ల‌ను తెచ్చామ‌ని పేర్కొన్నారు. విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ స‌హ‌కారంతో ప్రారంభ‌మైన బోన్సాయ్ గార్డెన్ నందు 25ర‌కాల బోన్సాయ్ మొక్క‌లు ఉన్నాయ‌ని తెలిపారు. అలాగే న‌గ‌ర‌పాల‌క సంస్థ స‌హ‌కారంతో మొక్క‌ల పెంప‌కం ఎలా, దానిప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌తిరోజు పార్క్‌కు వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌కు ఉచిత ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేశామ‌న్నారు. మొక్క‌ల పెంప‌కం ద్వారా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌ను పెంపొందించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. అదేవిధంగా రైతుల‌కు సెంద్రీయ ఎరువు, మొక్క‌ల‌ను అంద‌జేసి వారికి ఉపాధి క‌ల్పించడం కూడా చేస్తూ రైతుల‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని తెలిపారు. అలాగే పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు మొక్క‌ల పెంప‌కం ప‌ట్ల ఆస‌క్తి పెంపొందించేందుకు కూడా అమ‌రావ‌తి బోన్సాయ్ సొసైటి విశేషంగా కృషి చేయ‌డంతో పాటు వారికి శిక్ష‌ణ కూడా ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు. బోన్సాయ్ గార్డెన్ ప్రారంభోత్స‌వంలో వివిధ ర‌కాల మొక్క‌ల‌ను సంద‌ర్శ‌కుల ఎదుట ప్ర‌ద‌ర్శించారు. కార్య‌క్ర‌మంలో అమ‌రావ‌తి బోన్సాయ్ సొసైటి ఉపాధ్య‌క్షురాలు ఎర్నేని ప‌ద్మ‌జ, కార్య‌ద‌ర్శి ప‌త్తి నాగ‌ల‌క్ష్మీ, సంయుక్త కార్య‌ద‌ర్శి గ‌మిని సునీత‌, కోశాధికారి కంచ‌ర్ల దుర్గా సౌజ‌న్య‌, ఎగ్జిక్యూటీవ్ క‌మిటీ స‌భ్యులు డాక్ట‌ర్ కోనేరు ల‌క్ష్మీ నీలిమ‌, న‌ర్రా ప‌ద్మప్రియ‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *