Breaking News

56 వ డివిజన్ లో టిడిపి ఇంటింటికీ ప్రజల వద్దకు వెళ్లి సమస్యల సేకరణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర టిడిపి పిలుపు మేరకు, ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) ఆదేశాలతో విజయవాడ 56 వ డివిజన్ పార్టీ అధ్యక్షులు సందక సురేష్, ప్రధాన కార్యదర్శి పెద్దిన శ్యామ్ సుందర్ నాయకత్వంలో క్లస్టర్ ఇంఛార్జి దనేకుల వెంకట సుబ్బారావు, యూనిట్ ఇంఛార్జిలు బొందిలి తిలక్ రామ్ సింగ్, షేక్ బడేషా ఆధ్వర్యంలో రాష్ట్రములో నెలకొన్న అరాచక పాలన, దుష్ట శక్తుల దాడులు  అనాలోచిత నిర్ణయాలు మీద పోరాటం చేస్తూ  ఇంటింటికీ వెళ్లి ప్రజలను ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రూపకల్పన చేసిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమమాన్ని రాజ రాజేశ్వరీ పేట , మహంకాళి అమ్మవారి గుడి ప్రాంతాలల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ ప్రశాంతంగా ఉండాలన్నా , దందాలు, రౌడీ ఇజం లేని నగరంగా ఉండాలన్నా అభివృద్ది సంక్షేమం కావాలన్నా టిడిపి అధికారంలోకి రావాలని ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) నాయకత్వంలో ఈ సారి పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని 22 డివిజన్ లలో అభివృద్ది సాధించాలని,  పశ్చిమ నియోజక వర్గం ప్రత్యేకంగా  వ్యాపార సముదాయాలకు వ్యాపారాలకు నెలవు అని ఇక్కడ ప్రశాంతంగా వ్యాపారాలు జరగాలంటే టీడీపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
మైనార్టీ నాయకులు ఎమ్ ఎస్ బేగ్ మాట్లాడుతూ ఎంపి కేశినేని నాని ముప్పై ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న 990 కుటుంబాల ఇళ్ళ స్థలాల అంశం మీద కేంద్ర రైల్వే శాఖతో మాట్లాడి  పేద ప్రజలకు అండగా నిలిచారని, ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి ఇళ్ళ స్థలాలు ఏర్పాటు చేస్తామని ఓట్లు కొల్లగొట్టిన ఎమ్మెల్యే నాలుగేళ్లు అయినా మాట నిలుపుకోలేకపోయారని, ఈ ప్రభుత్వం అనేక కారణాలు చూపి వికలాంగులు వృద్దులు ఒంటరి మహిళలకు పింఛన్లు తొలగిస్తున్నారని పేదలకు ఇచ్చే సంక్షేమ పదకాలను పారదర్శకంగా, షరతులు లేకుండా అందించాలని డిమాండ్ చేశారు.
డివిజన్ క్లస్టర్ ఇంఛార్జి దనేకుల వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ఎంపి కేశినేని నాని, టిడిపి అన్ని వేళలా అండగా నిలిచిందని భవిష్యత్ లో కూడా ఇక్కడ డివిజన్ పార్టీ అండగా ఉంటుందని ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలు దౌర్యంగా టీడీపీకి తెలపాలని ప్రజల తరపున టిడిపి పోరాటం చేస్తుందని తెలిపారు.
డివిజన్ పార్టీ అధ్యక్షులు సందక సురేష్ మాట్లాడుతూ తాము ఇంటింటికీ వెళ్తుంటే ప్రతి ఇంట్లో కన్నీటి బాదలే కనపడుతున్నాయని ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయని వైసిపి ప్రభుత్వ ఏర్పాటు తరువాత పేదలు ఆర్థికంగా చితికి పోతారని మళ్ళీ ఇంకో ఛాన్స్ జగన్ మోహన్ రెడ్డికి ఇస్తే రాష్ట్రం సర్వ నాశనం అవుతుందని ప్రజలు చైతన్య వంతులు కావాలని టిడిపి అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టిడిపి కార్యాలయ కార్యదర్శి సారిపల్లి వెంకట రాధాకృష్ణ, రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి గూడెల వెంకట రమణ (శ్రీను), ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి శిరంశెట్టి నాగేంద్ర, రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వహక కార్యదర్శి బూర కనకారవు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి షేక్ గాలిబ్ సాహెబ్, మాజీ కార్పొరేటర్ సుకాసి సరిత మరియు డివిజన్ పార్టీ, నియోజకవర్గ టిడిపి కుటుంబ సభ్యులు పాల్గొని మద్దతు పలికారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *