విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువత గంజాయి వంటి మత్తుపదార్ధాలకు బానిస కాకుండా అవగాహనా కల్పించాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు బి. రవి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
బుధవారం స్థానిక లెనిన్ సెంటర్ హోటల్ అలంకార్ లోని నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమము లో భాగంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం మరియు కృష్ణాజిల్లాలో గల సహాయ సంచాలకులతో, డ్రగ్ డి సెంటర్స్ లో పనిచేయుచున్న సిబ్బంది, స్వచ్చంద సంస్థలతో అవగాహనా సదస్సు కార్యక్రమానికి సంచాలకులు బి. రవి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే మత్తు పదార్ధాల వినియోగం వల్ల కలిగే నష్టంపై అవగాహనా కలిగి ఉండాలన్నారు. వీటి వల్ల కలిగే అనర్ధాలపై విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించాలన్నారు. ఇటీవల సామజిక న్యాయం, సాధికారత విభాగం దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో దేశంలో 272 జిల్లాలను మాదకద్రవ్యాలు ఎక్కువగా తీసుకొను జిల్లాలుగా గుర్తించడం జరిగిందని వీటిలో మన రాష్టానికి చెందిన కృష్ణా, తూర్పు , పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం లు ఉన్నాయన్నారు. ఆయా జిల్లాలకు చెందిన అధికారులు దీనిపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలని సంచాలకులు అన్నారు.
ఈ కార్యక్రమనికి , విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవీంద్ర, సంచాలకులు,శ్రీమతి సౌమ్య జైన్, సహాయ సంచాలకులు శ్రీమతి రియాజ్ ఫాతిమా, స్టేట్ కోఆర్డినేటర్ శ్రీమతి ఉమా రాజ్, తూర్పు , పశ్చిమ గోదావరి, విశాఖపట్నం , కృష్ణాజిల్లా లో పనిచేస్తున్న సహాయ సంచాలకులు, డ్రగ్ డి సెంటర్స్ లో పనిచేస్తున్న సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News