Breaking News

భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పలు ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలనీ జాయింట్ కలెక్టర్ ఎస్. నుపుర్ అజయ్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణ పనుల ప్రగతిని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి శుక్రవారం జాయెంట్ కలెక్టర్ నుపుర్ అజయ్ రెవెన్యూ, రైల్వేస్, జాతీయ రహదారులు తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులకు మిగిలిఉన్న భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. విజయవాడ రూరల్ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన ప్రాధమిక ప్రకటనను పత్రికల ద్వారా జారీ చేయడం జరిగిందని ఇందుకు సంబంధించి అభ్యంతరాలను 60 రోజుల్లో అర్జీ దాఖలు చేసుకోవచ్చునని అన్నారు. జక్కంపూడి గ్రామంలో రైల్ ఓవర్ రైల్ కు సంబంధించి ప్రాధమిక ప్రకటనకు తగిన ప్రతిపాదనలు రూపొందించాలని విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులను కోరారు. విజయవాడ నార్త్ మండల పరిధిలోని గుణదల రైల్వేస్ కు సంబంధించి డిక్లరేషన్ ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. మైలవరం మండలం చంద్రాల గ్రామంలో ఆర్ అండ్ బి రహదారికి సంబందించిన అవార్డు ను రూపొందించాలని విజయవాడ సబ్ కలెక్టర్, రెవిన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ సూచించారు. క్షేత్ర స్థాయిలో భూ సేకరణకు సంబంధించి పెండింగ్ పనులలో సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. జాతీయ రహదారులతో పాటు జిల్లాలో చేపడుతున్న పలు ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ రహదారులు, రైల్వే అధికారులుతో రెవెన్యూ అధికారులు సమన్వయము చేసుకుని పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫెరెన్స్ లో డి.ఆర్.ఓ. కె. మోహన్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్ అదితి సింగ్, తిరువూరు, నందిగామ ఆర్.డి.ఓ. లు వై.వి. ప్రసన్న లక్ష్మి, ఏ. రవీంద్ర రావు, సంబంధిత మండల తహసీల్దార్లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *