విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వాలు మాదిరిగా శంకుస్థాపన లు చేసి వదిలేయకుండా త్వరితగతిన ప్రతి పనిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం 14వ డివిజన్ పుట్టారోడ్డు వద్ద దాదాపు 39 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్డు, వాటర్ పైప్ లైన్ పనులకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తో కలిసి అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయిన కేవలం మూడేళ్ళ కాలంలో ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే దాదాపు 600 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఏదైనా నియోజకవర్గంలో పార్టీ ఓడిపోతే అసలు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి పట్టించుకొనే వారు కాదని విమర్శించారు. కానీ జగన్ గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తున్నారు అని కొనియాడారు. ఇటీవల నగర మేయర్ ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ రోడ్డు పరిస్థితి గురుంచి ఆమె దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేపించారని, తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కి అన్నివిధాల సహకరిస్తున్న మేయర్ కి, అధికారులకి అవినాష్ ధన్యవాదాలు తెలిపారు. మాది చేతల ప్రభుత్వం తప్ప మాటల ప్రభుత్వం కాదని, అందుకే ఎలాంటి ఆర్భాటాలు లేకుండా శంకుస్థాపన చేయడమే కాకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అసలు అభివృద్ధి లేదు అని అసత్య ప్రచారాలు చేస్తున్న టీడీపీ పార్టీ వారు కళ్ళు తెరిచి వాస్తవాలు చూస్తే జరుగుతున్న అభివృద్ధి కనిపిస్తుంది అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైస్సార్సీపీ నాయకులు శెటికం దుర్గా ప్రసాద్, ఈశ్వర ప్రసాద్, సుబ్బరాజు, చిమటా బుజ్జి, కాళీ, ఆళ్ల చెల్లారావు, కళ్యాణ్, ఉకోటి రమేష్ తదితరులు పాల్గొన్నారు .
Prajavartha Online Telugu News