Breaking News

మాతృమూర్తికి శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందుకున్న జిల్లా కలెక్టర్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ జిల్లా అభివృద్ధికి పాటుపడుతూ మరెన్నో ఉన్నత పదవులను ఆదిరోహించి ఆదర్శవంతమైన అధికారిగా పేరు తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావుకు ఆయన మాతృమూర్తి ఎస్‌ పార్వతి ఆశీస్సులను అందజేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆయన నివాసంలో తన మాతృమూర్తి పార్వతి, సిబ్బందితో కలిసి కేకు కట్‌ చేసి నూతన సంవత్సర వేడుకను జరుపుకున్నారు. కేక్‌ కట్‌ చేసిన అనంతరం జిల్లా కలెక్టర్‌ తన తల్లికి కేకు తినిపించి పాదభివందనం చేసి ఆమె ఆశీస్సులను అందుకున్నారు. ఆదర్శవంతమైన అధికారిగా మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులను అందజేశారు.
అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావుకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ డివి రమణ, డిఆర్‌డిఏ పిడి శ్రీనివాస్‌రావు, డిఆర్‌పిఆర్‌వో యు. సురేంద్రనాథ్‌, డిపిఆర్‌వో ఎస్‌.వి మోహన్‌రావు, డ్వామా పిడి జె. సునీత, ఐసిడిఎస్‌ పిడి జి. ఉమాదేవి, డిఎస్‌వో పి. కోమలి పద్మ, కోపరేటివ్‌ ఆఫీసర్‌ సిహెచ్‌ శైలజ, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి బి.వి. విజయభారతి, డియంహెచ్‌వో యం సుహాసిని, పశుసంవర్థక శాఖ జెడి కె.విద్యాసాగర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యం విజయభారతి, మత్స్య శాఖ అధికారి నాగరాజ, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ యం శ్రీనివాస్‌రెడ్డి, సిపివో రత్నరూత్‌, వియంసి అడిషనల్‌ కమీషనర్‌ సత్యవతి, డిటిసి యం పురేంద్ర, హౌసింగ్‌ పిడి వి.శ్రీదేవి, పట్టు పరిశ్రమ శాఖ అధికారి బి.దయకర్‌బాబు, నందిగామ ఆర్‌డివో రవీంద్రరావు, నూజివీడి ఆర్‌డివో వై వి ప్రసన్నలక్ష్మి, మెడోనా మానసిక వికాలంగుల పాఠశాల విద్యార్థులు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నూతర సంవత్సరం శుభాకాంక్షలు అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *