-పొన్నపల్లి వెంకట సూర్యనారాయణ శర్మ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంగ్ల మాధ్యమం ప్రభావంతో తెలుగు సంస్కృత భాషలు క్షీణిస్తున్నాయని సంస్కృతిక భాష అధ్యాపకుడు పొన్నపల్లి వెంకట సూర్యనారాయణ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేద ఉపనిష సంస్కృతి విద్యను నేర్చుకుని విద్యార్థులకు హూణ విద్యల అవసరం ఏమిటని ప్రశ్నించారు. తెలుగు భాష తిరోగతి ప్రారంభమైందని, తెలుగు భాష పురోగమనానికి చేపట్టవలసిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. మాతృభాషపై ఎవరికైతే పట్టు ఉంటుందో వారు ఇతర భాషలను త్వరగా నేర్చుకోగలుతారని అన్నారు. పాఠశాలల్లో బోధించే తెలుగు అధ్యాపకులు సరైన వారు లేరని విచారాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సంస్కృత భాషల పట్టిమను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆనందించే రోజులు రావాలని కోరారు. ప్రతి జిల్లాకు సాంస్కృతిక కళాశాలలో అవసరమని చెప్పారు. విజ్ఞానం సరైన పద్ధతిలో ఉపయోగించకపోవడం వలన సమాజంలో అశాంతి ఏర్పడుతుందన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 56 సంస్కృతి కళాశాలలు ఉండేవని, 2003 కల్లా 50 కళాశాలలను తీసివేశారని నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ సంస్కృతిక కళాశాలలు ఉన్నాయని సాంస్కృతిక కళాశాలలో, వేద పాఠశాలలలో ఇంగ్లీష్ పాఠాలు ఉండకూడదని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆంగ్ల మాధ్యమాన్ని విద్యాలయంలో పెడితే సహించామని సాంస్కృతిక కావ్యాలు ఇంగ్లీషులో చెప్పమనడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వేద పాఠశాలలో జనరల్ ఎడ్యుకేషన్ లెక్కలు, సైన్స్, సోషల్ ఎందుకని ప్రశ్నించారు. ఆంగ్లంలో వ్యాకరణాలు చెప్పలేమని, ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని అన్నారు. పాణి మహర్షి, చిన్నయ్య సూరి, నన్నయ భట్టారుకుని సంస్కృత భాషలో ఉన్న పుస్తకాలను ఆంగ్లంలో తర్జుమా చేయుట ఎలా అని ప్రశ్నించారు. సాంస్కృతిక కళాశాలలో వేద పాఠశాలలను ఇంగ్లీష్ ఉండకూడదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు తమ ఆలోచన విరమించుకొని తెలుగు భాషకు, సాంస్కృత భాషకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News