విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని మాత్రమే చూడాలని, ఆలాకాకుండా ప్రతిదీ రాజకీయ కోణంలో చూడకూడదు అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 17వ డివిజన్, 78వ సచివాలయం పరిధిలోని రాణిగారితోట గుడ్ మార్నింగ్ టీ స్టాల్ ప్రక్క రోడ్ నుండి మొదలై గుండు సత్యం రోడ్, సాయి బాబా గుడి ఎదురు రోడ్ మరియు ఉల్లిపాయల రోడ్ ప్రాంతాల్లో నాయకులతో అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని, ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారు అని అన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే నవరత్నాలతో పేదల బ్రతుకుల్లో వెలుగులు నిండాయని, వారికి ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వ పాలన కొనసాగుతుంది అని అన్నారు. ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రజలు విసుగుచెందారు అన్నట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అని, రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారు కాబట్టే నిన్న స్వయానా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి వస్తే ఆ సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పారంటేనే అర్థం అవుతుంది ప్రజల గుండెల్లో అవి ఎంతగా నిలిచి ఉన్నాయని అన్నారు. ప్రజలు కూడా మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలని మరలా వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని అవినాష్ కోరారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, నాగవంశ కార్పొరేషన్ డైరక్టర్ ఎర్నేటి సుజాత వైసిపి నాయకులు కాశీ, తాజుద్దీన్, వెంకటేశ్వరావు, తిరుపతిరెడ్డి, సుధాకర్, దామోదర్, గీతా కుమారి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
దేవినేని నెహ్రు ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఫిన్ బండి వితరణ
శుక్రవారం 17వ డివిజన్ బాపనయ్య నగర్ కి చెందిన దొంతిరెడ్డి తిరుపతమ్మ అద్దె బండితో ఇబ్బందిగా ఉందని స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా వారికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 25,000 రూపాయలు విలువ చేసే టిఫిన్ బండి ఉచితంగా అందజేయడం జరిగింది.
Prajavartha Online Telugu News