Breaking News

సంక్షేమంలో వై.యస్.జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి హామీని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3,4,5 డివిజన్లు సంబంధిచి క్రీస్తురాజుపురం క్రైస్ట్ ద కింగ్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమంలో ఆ డివిజన్లో కొత్తగా మంజూరు అయిన 120 మందికి పెరిగిన పెన్షన్ లను లబ్ధిదారులకు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ నూతనంగా పెన్షన్ పెంచిన లబ్ధిదారులకు పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రమాణస్వీకారం రోజు ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి 250 రూ చొప్పున పెంచుతూ 2750 చేశారని, పెంచిన పెన్షన్ నేటి నుండి అందజేస్తుంటే ఆ అవ్వాతాత ల కళ్ళలో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో అరకొర పెన్షన్ లు ఇస్తూ వాటి కోసం కూడా కార్యాలయాల చుట్టూ కళ్లరిగేలా తిరిగే పరిస్థితి ఉండేదని, జగన్ హామీ ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు హడావుడి గా పెన్షన్ పెంచి ఓట్లు రాజకీయాలకు తెర లేపారని కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి వైసీపీ ని భారీ మెజారిటీతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా నేడు పాలన సాగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. కొండ ప్రాంతాలలో చివరి అంచు ఇల్లు వరుకు కూడా వాలంటీర్లు అందజేస్తున్నారు అని అన్నారు,వెళ్లి సంక్షేమ పథకాలు అర్హతే ప్రామాణికంగా నేరుగా ఇంటి వద్దకే పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఇప్పుడు తెలుగుదేశం వారికి వారి రాజకీయ మనుగడ కోసం ఏమి చేయాలో పాలుపోక పెన్షన్లు తీసేసుస్తున్నారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు అని, ఒక్కసారి మీ ప్రభుత్వం లో ఇచ్చిన పెన్షన్లు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఇస్తున్నారో చూడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, 5వ డివిజన్ కార్పొరేటర్ కలపాలు అంబేద్కర్,4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా రవి మరియు వైసిపి నాయకులు, గ్రామా,వార్డ్ సచివాలయం సిబ్బంది మరియు కన్వీనర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *