Breaking News

పింఛన్ దారులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండ

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ పింఛన్ కానుక పెంపుతో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 28, 29 డివిజన్లకు సంబంధించి మధురానగర్లోని 207 వ సచివాలయంలో జరిగిన పింఛన్ వారోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిశీలకులు కడవకొల్లు నరసింహారావు, నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతితో కలిసి లబ్ధిదారులకు నూతన పింఛన్లను అందజేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పింఛన్ కానుక పెంచి పేద వర్గాల కళ్లల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనందం నింపారని తెలిపారు. చంద్రబాబుకు ఎన్నికల ముందు మాత్రమే వృద్ధులు గుర్తొస్తాయని విమర్శించారు. పింఛన్ల పెంపు కూడా వైఎస్ జగన్‌ పాదయాత్రలో ప్రకటిస్తే.. ఆ తరువాత ఎన్నికలకు మూడు నెలల ముందు పింఛన్లు పెంచారన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగా పింఛన్లను దఫాల వారీగా పెంచుకుంటూ పోతున్నారని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పేదలకు న్యాయం చేయడంలో వెనుకాడటం లేదని తెలియజేశారు. 28వ డివిజన్ లో 25 మందికి., 29వ డివిజన్లో 37 మందికి కలిపి మొత్తం 62 కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. పేదలకు పెద్ద ఎత్తున జరుగుతున్న మేలును చూసి ఓర్వలేక పింఛన్లపై ప్రతిపక్షాలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని మల్లాది విష్ణు మండిపడ్డారు. ఇటీవల నోటీసులు జారీచేసిన 1,764 మందిలో కూడా 1,074 మందికి పింఛన్ అందజేయడం జరిగిందన్నారు. కేవలం ఇన్ కం ట్యాక్స్ చెల్లించే వారికి, కార్లు ఉన్న వారికి మాత్రమే పింఛన్ ను నిలిపివేసినట్లు తెలియజేశారు. కానీ పింఛన్లు తొలగిస్తున్నారంటూ టీడీపీ దుర్మార్గ ప్రచారం చేస్తోందని.. దీన్ని ప్రజలందరూ తిప్పికొట్టాలని కోరారు.

టీడీపీ హయాంలో పింఛన్ల వ్యవస్థ అవినీతిమయం
తెలుగుదేశం హయాంలో బడ్జెట్ భారీగా ఉన్నా.. నిధులన్నీ టీడీపీ నేతల జేబుల్లోకి, జన్మభూమి కమిటీ సభ్యుల ఇళ్లకు చేరాయని మల్లాది విష్ణు ఆరోపించారు. భర్తతో కలిసి ఉన్న మహిళలకు కూడా ఒంటరి మహిళ పెన్షన్లు మంజూరు చేయించి జన్మభూమి కమిటీలు చేసిన అక్రమాలు అంతా ఇంతా కాదన్నారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక అత్యంత పారదర్శకంగా, శాచ్యురేషన్ పద్ధతిలో నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆస్పత్రికి వెళ్లి వస్తున్న వృద్ధురాలికి జరిగిన ప్రమాదాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించేందుకు విఫలయత్నం చేసి భంగపడ్డారని తెలిపారు. చివరకు వృద్ధురాలి కుటుంబసభ్యులే మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు వెల్లడించడంతో.. పచ్చ నేతల నోట మాట పడిపోయిందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఎక్కడా సాంకేతిక కారణాల వల్ల పింఛన్‌ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లకు సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ జి.సుజనా, సిడిఓ జగదీశ్వరి, నాయకులు కనపర్తి కొండా, ఎస్.కె.బాబు, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *