Breaking News

భూ రక్షా పథకం యొక్క పత్రాలు పంపిణీ చేసి సంపూర్ణ నివేదిక ఇవ్వాలి…

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
భూ యజమానులకు సత్వరమే భూ హక్కు, భూ రక్షా పథకం యొక్క పత్రాలు పంపిణీ చేసి సంపూర్ణ నివేదిక ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం అనపర్తి మండలం రామవరం గ్రామంలో జగనన్న భూ హక్కు, భూ రక్షా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, అనపర్తి మండలంలోని రామవరం గ్రామంలో పంపిణీ చెయ్యవలసిన 692 భూ హక్కు పత్రాల లో 506 పత్రాలు ఇప్పటి వరకు అందజేశారన్నారు. ఈరోజు జాయింట్ కలెక్టర్ సమక్షం ఐదుగురు హక్కు దారులకు అందచెయ్యడం జరిగింది. అనపర్తి నియోజక వర్గం పరిధిలో మొత్తం 5,641 లో పంపిణీ చెయ్యవలసిన వాటిని కూడా త్వరిత గతిన పంపిణీ చేసి సంపూర్ణ నివేదిక అందచేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వెంట ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి , తహశీల్దార్ కే..పోసిబాబు, డిటి శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *