Breaking News

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న తోడు, వైయస్ఆర్ కళ్యాణ మస్తు, షాది తోఫా, హౌసింగ్ రుణాల పంపిణీ పై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక మేరకు లక్ష్యాలను సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.

శుక్రవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై డిఆర్డీఏ, పశు సంవర్ధక శాఖ అధికారులతో వివిధ పథకాల అమలు పై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో ఇండ్ల నిర్మాణా లకోసం అదనపు రుణాలు కోసం 34,643 అర్హులకు గాను 23,504 మందికి (68%) ఇవ్వడం జరిగిందని, మిగిలిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు నాన్ ఎస్ హెచ్ జి లకు చెందిన 49,953 మందికి గాను 23,504 మందికి రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మిగిలిన లక్ష్యాలు సాధించడానికి తగిన కార్యాచరణ తో రావాలని స్పష్టం చేశారు.
జగనన్న తోడు కింద 12,636 లబ్ధిదారులకు గాను 5613 మందికి రూ.5.61 కోట్ల రుణాలు అందచేశారని, స్క్రూ టిని అయిన మిగిలిన యూనిట్స్ వెంటనే గ్రౌండింగ్ చెయ్యడానికి, బ్యాంకర్స్ తో మాట్లాడి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. పశు క్రాంతి పథకం కింద వైయస్ఆర్ చేయుత కింద 2,044 యూనిట్స్ , 4,669 మంది కు పశు కిసాన్ కార్డు లు జారీ చేసి, ఈ కే వైసి పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

వైయస్ఆర్ కల్యాణ మస్తు కింద 1723 మంది లబ్దిదారులు ధరకాస్తు చేసుకోగా వాటిని వెంటనే ప్రభుత్వ మార్గదర్శకాలు స్క్రూ టిని చేయాలన్నారు. వైయస్ఆర్ కల్యాణ మస్తు, షాది తోఫా కింద ఎస్సీ, ఎస్టీ లకు లక్ష రూపాయలు, ఎస్సీ, ఎస్టీ లు కులాంతర వివాహం చేసుకుంటే రూ.1.20 లక్షలు, బిసి లకు రూ.50 వేలు, బిసి లు కులాంతర వివాహం చేసుకుంటే రూ 75 వేలు, వికలాంగులకు రూ.1.50 లక్షలు, బిల్డింగ్ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సభ్యులకు రూ.50 వేలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వైయస్ఆర్ చేయూత కింద 4,560 మంది లబ్ధిదారులకు రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ 75000 వేలు ఇవ్వడం ద్వారా వారికి ఆర్థిక సాధికారతదిశగా అడుగులు వేయడం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో డి అర్ డి ఎ పి డి ఎస్. సుభాషిణి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ జీ టి సత్య గోవింద్, సంబందించిన శాఖల క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

HNSS పనులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా…2027లోగా పూర్తి చేయాలని ఆదేశం

-2027 నాటికి HNSS శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులుపై కేబినెట్‌లో మంత్రి మండిపల్లిని అడిగిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *