విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఏపీ రెసిడెన్సియల్ మైనార్టీ బాలికల వసతి గృహా నిర్మాణానికి నున్న గ్రామంలో ప్రతిపాదించిన స్థలాన్ని బుధవారం జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్ స్థానిక రెవిన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. నున్న టీచర్స్ కాలనీ సమీపంలోని ఆర్ . ఎస్ నంబర్ 370/1, 70/3 లో మూడున్నర ఎకరాలు స్థలాన్ని కేటాయించాలని జిల్లా కాళోక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆదేశాలు జారీ చేసారు . రెండు దశాబ్దాల క్రితం 2003వ సంవత్సరంలో మైనార్టీ బాలికల కోసం విజయవాడలో పాఠశాలను ఏర్పాటు చేసారు . అప్పట్లో విద్యాధర పురం లోని ఆర్ టి సి శిక్షణ కేంద్రంలో తాత్కాలికంగా చేయగా ప్రస్తుతం ఐరన్ యాడ్ అద్దె భవనం లో పాటలసాను నిర్వహిస్తున్నారు . పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు విద్యాబ్యాసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మైనార్టీ బాలికల పాఠశాల వసతి గృహాలకు శాశ్వత ప్రాతిపదికన భావన నిర్మాణం చేపట్టేందుకు స్థలం కేటాయించాలని ఏపీ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు కు ప్రతిపాదనలు పంపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విజయవాడ రురల్ మండలం నున్న లో గల ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి నందు మూడున్నర ఎకరాలు మైనార్టీ బాలికల పాఠశాల వసతి గృహానికి కేటాయించేందుకు స్థలాన్ని పరిశీలించాలని జాయింట్ కలెక్టర్ కు సూచించారు. స్థలాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పాఠశాల హాస్టల్ నిర్మాణానికి ప్రతిపాదించిన భూమి అనువుగా ఉంటుందని ఇందుకు సంబంధించిన నివేదికలను సమర్పించేందుకు చర్యలు తీసుకుంటుంటామని జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్ తెలిపారు. పరిశీలనలో జాయింట్ కలెక్టర్ వెంట రురల్ తాశీల్ధార్ శ్రీనివాస్ నాయక్ , రెవిన్యూ ఇన్స్ పెక్టర్ రామ్ సింగ్ , వి ఆర్ ఓ లు టి. శంకర్ , డి. శ్రీనివాస్ , చాంద్ , సర్వేయర్ ఎ . రమేష్ తదితరులు ఉన్నారు .
Prajavartha Online Telugu News